సింధుకు మరో అరుదైన గౌరవం

సింధుకు మరో అరుదైన గౌరవం - Sakshi


రియో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని సాధించి దేశ గౌరవాన్ని నిలబెట్టిన తెలుగుతేజం పీవీ సింధుకు అవార్డులు, రివార్డులు వెల్లువెత్తూనే ఉన్నాయి. ఒలింపిక్స్‌లో అసమాన పోరాట పటిమ కనబర్చిన ఆమెను తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ సత్కరించారు. ఇక రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేతుల మీదగా  అత్యుత్తమ క్రీడా అవార్డు 'ఖేల్‌ రత్న'ను ఆమె అందుకున్నారు.



రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆమెకు నగదు రివార్డులను, ఇతర నజరానాలను ప్రకటించాయి. ఈ ప్రశంసల వెల్లువలోనే మరో అరుదైన గౌరవం పీవీ సింధును వరించింది. నిత్యం దేశ భద్రతలో నిమగ్నమయ్యే సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీసు ఫోర్స్‌ (సీఆర్‌పీఎఫ్‌) ఆమెను బ్రాండ్‌ అంబాసిడర్‌ గౌరవ కమాండెంట్‌గా నియమించాలని నిర్ణయించింది. గౌరవ హోదాలో కొనసాగేందుకు పీవీ సింధు కూడా అనుమతి తెలిపినట్టు తెలిసింది. సీఆర్‌పీఎఫ్‌లో ఆమె సేవలు ఈమేరకు వినియోగించుకునేందుకు ఆ విభాగం కేంద్ర హోంశాఖకు ప్రతిపాదన పంపించింది.

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top