'మీ అభిప్రాయాలు నాతో పంచుకోండి'

'మీ అభిప్రాయాలు నాతో పంచుకోండి' - Sakshi


న్యూఢిల్లీ: తన ఏడాది పాలనలో ఉత్పత్తి పెరిగిందని, ద్రవ్యోల్బణం తగ్గిందని నరేంద్ర మోదీ తెలిపారు. విద్యుత్ ఉత్పత్తి అధికంగా జరిగిందని, పేదలకు బ్యాంకు ఖాతాలు వచ్చాయని పేర్కొన్నారు. ఏడాది పాలనలో చాలా మార్పు జరిగిందని వ్యాఖ్యానించారు. తాను ప్రధానిగా బాధ్యతలు చేపట్టి ఏడాది గడిచిన సందర్భంగా దేశ ప్రజలకు మోదీ బహిరంగ లేఖ రాశారు.



పరిపాలనలో పారదర్శకత పెంచామని, సంస్కరణలను పరుగుపెట్టించామన్నారు. అవినీతిని తగ్గించామని, అభివృద్ధికి పునాది వేశామని చెప్పుకొచ్చారు. ఉపాధికి బాటలు పరిచామని, ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టామన్నారు. సమాఖ్య వ్యవస్థను పటిష్టం చేశామని పేర్కొన్నారు. మనదేశంవైపు ఇప్పుడు యావత్ ప్రపంచం ఆశావాద దృక్పథంతో చూస్తోందన్నారు. భారతదేశంలో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయని తెలిపారు.



ఎన్డీఏ ఏడాది పాలనపై అభిప్రాయాలు తనతో పంచుకోవాలని దేశ ప్రజలను ట్విటర్ ద్వారా మోదీ కోరారు. దేశాన్ని ప్రగతిపథంలో నడిపించేందుకు ప్రజలు ఆలోచనలు ఎంతో ముఖ్యమన్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top