టాప్‌పెయిడ్‌ టీవీ భామలెవరో తెలుసా?

టాప్‌పెయిడ్‌ టీవీ భామలెవరో తెలుసా? - Sakshi


న్యూయార్క్: 'దేశీ గర్ల్‌' ప్రియాంక చోప్రా మరో ఘనతను సొంతం చేసుకుంది. అమెరికన్‌ టీవీ సిరీస్‌ 'క్వాంటికో'లో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ ప్రపంచ టాప్‌-10 టీవీ నటీమణుల్లో ఒకరిగా ఫోర్బ్స్‌ జాబితాలో చోటు సంపాదించింది. ఈ జాబితాలో తొలిసారిగా చోటు సాధించిన భారతీయురాలిగా ఆమె రికార్డు సొంతం చేసుకుంది.



ప్రపంచంలో అత్యధికంగా ఆర్జిస్తున్న టీవీ నటీమణుల జాబితాలో వరుసగా ఐదో ఏడాది అమెరికన్‌ నటి సోఫియా వర్గరా తొలి స్థానంలో నిలువగా, బాలీవుడ్ భామ ప్రింయాక ఎనిమిదో ర్యాంక్ సొంతం చేసుకుంది. 'మోడ్రన్‌ ఫ్యామిలీ' టీవీ షోతో సూపర్‌ హిట్‌ సాధించిన 44 ఏళ్ల సోఫియా వర్గరా మొత్తం 43 మిలియన్‌ డాలర్ల (రూ. 288 కోట్ల) సంపద ఆర్జించింది. అయితే, ఇందులో టీవీ షో ద్వారా ఆమెకు దక్కింది తక్కువే. కానీ, వాణిజ్య ప్రకటనలు, బ్రాండ్‌ అంబాసిడర్‌ ఎండార్స్‌మెంట్లతోనే ఆమె ఆర్జన గణనీయంగా పెరిగింది.



ఇక ఎనిమిదో స్థానంలో నిలిచిన ప్రియాంక 11 మిలియన్ల (రూ. 73.69 కోట్ల) డాలర్ల సంపదను తన ఖాతాలో వేసుకుంది. గత ఏడాది ఏబీసీ చానెల్‌లో ప్రసారమైన 'క్వాంటికో'తో అంతర్జాతీయ ప్రేక్షకులను పలుకరించిన ఈ అమ్మడు.. ఈ సిరీస్‌ రెండో సీజన్‌లోనూ నటించనుంది. గత ఏడాది 'బాజీరావు మస్తానీ', 'గంగాజల్‌' సినిమాల్లో నటించిన పియాంక 'బేవాచ్‌' సినిమాతో హాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇవ్వబోతున్నది.



'ద బిగ్ బ్యాంగ్‌ థియరీ' నటి కేలీ కౌకో 24.5 మిలియన్‌ డాలర్ల సంపదతో ఫోర్బ్స్‌ జాబితాలో రెండోస్థానంలో నిలువగా, మూడోస్థానంలో మిండీ కేలింగ్ (15మిలియన్‌ డాలర్లు), ఎలెన్‌ పాంపియో, మరిస్కా హర్గితే 14.5 మిలియన్ల సంపదతో ఉమ్మడిగా నాలుగోస్థానంలో  నిలిచారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top