'ప్రజ్వల' కోసం మేము సైతం...

'ప్రజ్వల' కోసం మేము సైతం... - Sakshi


హైదరాబాద్: దేశంలోని ప్రతి రెడ్ లైట్ ఏరియాలో తెలుగు అమ్మాయిలు ఉన్నారని ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి సునీతా కృష్ణన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల మహారాష్ట్రలోని చంద్రాపూర్లో వ్యభిచార గృహాలపై తెలంగాణ రాష్ట్రానికి చెందిన సీఐడీ అధికారులు దాడి చేసి 64 మందిని రక్షించిన విషయాన్ని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న వ్యభిచార గృహాలలో దాదాపు 95 శాతం మంది తెలుగు అమ్మాయిలే ఉన్నారని చెప్పారు. ఇది అందోళన కలిగించే విషయమన్నారు. ఇలాంటి వారిని రక్షించి... హైదరాబాద్లో ఆశ్రయం కల్పిస్తున్న గూడు ఈ ఏడాది సెప్టెంబర్ 30 తేదీతో చెదిరిపోనుంది. దీంతో ఆ తేదీ లోపు ఆశ్రయం పొందుతున్న వారందరికి కోసం కొత్తగా ఓ భవనం నిర్మించాలని ప్రజ్వల నిర్ణయించింది.


అందులోభాగంగా సెప్టెంబర్ 30 లోపు ఓ భవనం కట్టుకుని అక్కడికి వెళ్లి పోవాల్సిన ప్రజ్వల భావిస్తుంది. అందుకోసం స్వచ్ఛందంగా విరాళాలు సేకరించేందుకు ఆదివారం 'సాక్షి' టీవీలో ఏర్పాటు చేసిన లైవ్ షోలో ఆ సంస్థ ప్రతినిధులు సునీతా కృష్ణన్తోపాటు మల్లేశ్, అహ్మద్ అలీ పాల్గొన్నారు. అక్రమ రవాణా నుంచి తప్పించిన వారిని, వ్యభిచార కూపంలో చిక్కుకున్న వారిని బయటకు తీసుకువచ్చి... వారి కోసం ప్రజ్వల చేపడుతున్న సేవలను వారు వివరించారు. మానవత్వం మూర్తిభవించిన దాతలు మేము సైతం అంటూ ముందుకు వచ్చారు. వారి స్పందనలు ఇలా ఉన్నాయి...


దివ్య, రాజ్ ప్రొటెక్ట్ కంపెనీ : రూ.1,70, 000  ఇస్తున్నట్లు ప్రకటించారు.

హేమంత్, హైదరాబాద్: తమ స్నేహితులకు ఈ విషయాన్ని చెప్పి.. తనతో పాటు వారు కూడా సాయం చేస్తామని చెప్పారు

నవ్య, హైదరాబాద్ : రూ 30 వేలు బ్యాంకు అకౌంట్లో జమ చేస్తామన్నారు

దేవి, బెంగళూరు : రూ. 5 వేలు ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ఆమె ఉద్వేగానికి లోనైంది. మనీ ట్రాన్స్ఫర్ చేయడం చాలా ఈజీ అవుతుంది కానీ సునీత కృష్ణన్లా చేసే వారు ఉండరని చెప్పారు.

సుమంత్, హైదరాబాద్: తన జీతం నుంచి ప్రతినెల ఎంతో కొంత నగదు ఈ స్వచ్ఛంద సంస్థకు అందజేస్తామన్నారు.

భార్గవ్, హైదరాబాద్ : రూ.50 వేలు ఇస్తున్నట్లు చెప్పారు.

కృష్ణారెడ్డి, తిరుపతి : రూ. 50 వేలు ఇస్తానన్నారు. తమ విద్యాసంస్థలో చదువుతున్న విద్యార్థుల

పేరు చెప్పేందుకు ఇష్టపడిన ఓ వ్యక్తి రూ. 3 లక్షలు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు.

స్వరూపరాణి, గుంతకల్ : రూ. 500 ఇస్తానన్నారు. ఆమె ఉద్యోగి, తనకు వచ్చే రూ. 5 వేల జీతంలో నుంచి 500 ఇస్తున్నట్లు చెప్పారు.

లత, ఖమ్మం : సునీతా కృష్ణన్ గొప్ప కార్యం చేస్తున్నారని చెప్పారు.

పద్మ , సిద్ధిపేట : రూ. 5 వేలు ఇస్తున్నట్లు చెప్పారు

మాళవిక, హైదరాబాద్: రూ. 25 వేలు.. సునీత కృష్ణన్ గారు సేవలను ప్రశంసించారు.

రమ్య, హైదరాబాద్: రూ. 5 వేలు

శ్రీనివాసులు, రాయచోటి (వైఎస్ఆర్ జిల్లా) : రూ. వెయ్యి

చైతన్య, మహబూబ్నగర్ : రూ. 5 వేలు

వెంకటరమణ, దర్శి (ప్రకాశం జిల్లా) : రూ. 2 వేలు

శ్రీనివాస్, భువనగిరి (నల్గొండ) : ప్రభుత్వం సాయం తీసుకుంటే ఈ సంస్థకు మరింత అభివృద్ధిలోకి వస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు.

విజయలక్ష్మి, హైదరాబాద్ : రూ. వెయ్యి

మేఘన(6), ప్రొద్దుటూరు (వైఎస్ఆర్ జిల్లా) : తన తండ్రిని అడిగి రూ. పదివేలు ఇస్తానని చెప్పింది.


ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ

అకౌంట్ నెం 30312010131345

సిండికేట్ బ్యాంకు, శాలిబండ శాఖ, హైదరాబాద్

ఐఎఫ్ఎస్ కోడ్: SYNB0003031

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top