పోలీసుల 'రేప్ జోక్'పై దుమారం

పోలీసుల 'రేప్ జోక్'పై దుమారం - Sakshi


లండన్: ఫుట్బాల్ మ్యాచ్లో ఓటమిని ఓ అభిమాని రేప్తో పోలుస్తూ.. పోలీస్ ట్విట్టర్ పేజీలో ట్వీట్ చేయడం ఇంగ్లండ్లో దుమారం రేపింది. దీనిపై మెర్సీసైడ్ పోలీసులు విచారణ ప్రారంభించారు.



గుడిసన్ పార్క్లో జరిగిన ఓ ఫుట్బాల్ మ్యాచ్లో ఎవర్టన్ జట్టు 6-2తో సదర్లాండ్ జట్టును ఓడించింది. ఈ ఓటమిపై ఓ అభిమాని స్పందిస్తూ.. గుడిసన్ పార్క్లో రేప్ జరిగిందని, ఈ విషయన్ని ఫిర్యాదు చేయాలని భావిస్తున్నానని పోలీసులకు ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్కు పోలీసులు స్పందిస్తూ.. సదర్లాండ్ ఆటగాళ్లు రేప్‌నకు గురయ్యారని జోక్ చేస్తూ ట్వీట్ చేశారు.



దీనిపై ట్విట్టర్ యూజర్లు తీవ్రంగా విమర్శిస్తూ పోలీసుల తీరును తప్పుపట్టారు. పోలీసులు వెంటనే తీవ్రతను గ్రహించి ఈ ట్వీట్ను తొలగించి.. క్షమాపణలు చెబుతూ మరో ట్వీట్ చేశారు. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశిస్తున్నట్టు మెర్సీసైడ్ పోలీసులు ట్విట్టర్లో పేర్కొన్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top