లీటరు పెట్రోల్‌ వాస్తవ ధర 31.94!

లీటరు పెట్రోల్‌ వాస్తవ ధర 31.94!

  • మిగతాదంతా పన్నులు

  • గతంలో ఎన్నడూలేనంతగా పెరిగిన ధరలు

  • అడ్డగోలు ధరలపై అడిగే నాథుడే లేడు



  • అది 2013, దేశ రాజధానిలో పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటాయి. లీటరు రూ.69.06కు చేరింది. భారతీయ జనతా పార్టీ రోడ్లమీదకు వచ్చి ధర్నాలు చేసింది. "ఇది దేశ ద్రోహం. దీనిపై వెనక్కి వెళ్లే ఉద్దేశం లేదు. ధరలను అదుపులోకి తేవాల్సిందే''  అని అప్పటి బీజేపీ అధికార ప్రతినిధి రాజీవ్ ప్రతాప్ రూఢీ నిందించారు.  



    తిరిగి చూస్తే నేడు ఢిల్లీలో పెట్రోల్ ధర రూ71.14. , 2013లో డీజిల్ రూ 48.16 నుంచి  రూ.59.02కు చేరింది. వంట చేసుకునే కిరోసిన్ రూ14.96 నుంచి రూ.18.54కు పెరిగింది. వంటగ్యాసు రూ.410.50నుంచి 585 కు గణనీయంగా పెరిగింది. 2013లో ఉన్న ముడి చమురు ధర కంటే ఇప్పుడు సగమే ఉంది. బ్యారల్ రేటు 114డాలర్లు ఉండగా ఇప్పుడు 54డాలర్లుగా ఉంది. ఇప్పుడు డాలర్ రేటుతో పోలిస్తే రూపాయి విలువ అంతగా లేదు. 2013లో డాలర్ విలువ రూ.54.30 నుంచి రూ68కు పెరిగింది.



    రూపాయి పరంగా చూస్తే బ్యారల్ ముడి చమురు అప్పుడు రూ. 6210కు వస్తే ఇప్పుడు రూ.3625లకే వస్తోంది. భారత్ కరెన్సీ తో పోలిస్తే బలహీనంగా ఉన్న పొరుగు దేశాల్లో ఇవన్నీ చాలా చవకగ్గా లభిస్తున్నాయి. చాలా ఎక్కువ రాయితీలు ఇస్తున్నాయి. భారత కరెన్సీలో పాకిస్తాన్ లో కేవలం రూ.43.70, శ్రీలంకలో రూ.54.18. బంగ్లాదేశ్ లో రూ.75.42లకే లీటర్ పెట్రోల్ లభిస్తోంది. రవాణా ఖర్చులతో సహా రూ. 64.38లకే వస్తుంది. డీజిల్ విషయానికొస్తే పాకిస్తాన్ లో రూ. 49.60, శ్రీలంకలో రూ.43.99, బంగ్లాదేశ్ లో రూ.57, నేపాల్ లో రూ49.16లకు వస్తోంది.

        

    భారత్ లో అధిక ధరల వెనుక కారణాలు రవాణా ధరలు, పన్నులు. ప్రభుత్వరంగ చమురు కంపెనీల అధికారిక సమాచారం ప్రకారం జనవరి 16న బ్యారల్ ముడి చమురు ధర 68.88 డాలర్లుగా ఉంది. రిఫైనరీ కంపెనీలు లీటరుకు రూ.28.19 వసూలు చేస్తున్నాయి. దీనిని చమురు కంపెనీలు రూ.31.94కు డీలర్లకు అమ్ముతున్నాయి. ఇది రోజువారీ మనం ఉపమోగించే పెట్రోల్ వాస్తవిక ధర. మిగిలినది మనం పన్నులు, సుంకాల రూపంలో చెల్లిస్తున్నాం. నేడు దేశ రాజధానిలో వినియోగదారుడు రూ.21.48 ఎక్సైజ్‌ పన్ను కడుతున్నాడు. అంటే రిఫైనరీలు (ఇండియన్ ఆయిల్, భారత్ గ్యాస్) అమ్మే ధరకు సుమారు 75శాతం  పన్ను చెల్లిస్తున్నాడు. డీలర్ కమీషన్ రూ.2.60, రాష్ట్ర పన్నులు 27శాతం అంటే రూ.15.12 అన్ని కలుపుకొని వినియోగదారుడు లీటరు పెట్రోల్‌కు రూ.71.14 చెల్లిస్తున్నాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చమురు కంపెనీల ధరకు 125 శాతం పన్నులు వేసి లీటరుకు అదనంగా రూ.36.60 పిండుతున్నాయి.

        

    చమురు కంపెనీల రేటు లీటరుకు రూ.28.59, డీలరు కమీషన్ రూ.1.65, కేంద్ర ఎక్సైజ్‌ పన్ను రూ.8.72 కలుపుకొన్నా మొత్తం రూ.59.02గా ఉండాలి. మిగిలిన రూ.26.05లు కేంద్ర రాష్ట్రాల విలువ ఆధారిత పన్ను భారం. ఇది దాదాపు చమురు కంపెనీలు ఇచ్చే రేటుకు(రూ.28.59)కు సమానం. ఇక్కడ మరో విషయం ఏమిటంటే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే దేశ రాజధానిలో రవాణా చార్జీలు చాలా తక్కువ. పరిస్థితి ఇలా కొంతమంది నేతలు మాత్రమే రవాణా చార్జీల మీద మాట్లాడుతున్నారు. అధికారంలోకి రాగానే ఎన్డీఏ ప్రభుత్వం పెట్రోల్ ధరలు పెంచి ప్రజలను అన్యాయంగా దోచుకుంటోందని కేరళ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకుడు ఉమెన్ చాందీ విమర్శించారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top