పేటీఎం పేమెంట్‌ బ్యాంకు వడ్డీరేటు ఎంతో తెలుసా?

పేటీఎం పేమెంట్‌ బ్యాంకు వడ్డీరేటు ఎంతో తెలుసా?


న్యూఢిల్లీ: పే మెంట్‌ బ్యాంక్‌ సేవలను  ప్రారంభించనున్న ఇ-వాలెట్‌ అగ్రగామి పేటీఎం  తన పేమెంట్‌ బ్యాంక్‌  మొట్టమొదటి శాఖను నేడు( మే 23, మంగళవారం) ఢిల్లీలో ప్రారంభించనుంది. ఈ సందర్బంగా వినియోగదారులకు  చెల్లించనున్న  వార్షిక వడ్డీరేటును ప్రకటించింది. దాదాపు ఒక సంవత్సరం ఆలస్యం తరువా , కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌ ఆధ్వర్యంలో పేటీఎం తన చెల్లింపుల బ్యాంకును లాంచ్‌ చేస్తోంది.  ఢిల్లీలో మొదట శాఖను ప్రారంభించనున్నామని, ఇతర మెట్రో నగరాల్లో రెండో విడత ప్రారంభిస్తామని 'పేటీఎం యాజమాన్య సంస్థ వన్97 కమ్యూనికేషన్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. మూడు నెలలు తర్వాత రెండో విడతను ప్రారంభించే అవకాశం ఉందని తెలిపారు


దేశంలోని మొత్తం మూడు చెల్లింపులు (ఎయిర్టెల్,  ఇండియా పోస్ట్) బ్యాంకులలో అత్యల్పంగా వడ్డీరేటును ఆఫర్‌ చేస్తోంది. ఏడాదికి ఎయిర్టెల్ 7.25 శాతం, ఇండియా పోస్ట్  5.5 శాతం వడ్డీని అందిస్తోంటే  పేటీఎం మాత్రం వినియోగదారులకు 4శాతం వార్షిక వడ్డీ రేటును అందించనున్నట్టు తెలిపింది.  అలాగే డిపాజిట్లపై  క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ను  వెల్లడించింది.


2020 నాటికి కంపెనీ 500 మిలియన్ల ఖాతాలను తెరవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని  పేమెంట్స్ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రణూ సత్తీ చెప్పారు. ఈ నేపథ్యంలో మొదటి శాఖను  నోయిడాలో  మంగళవారం  ప్రారంభించనుంది. ఈ సంవత్సరంలో 31 శాఖలు, 3,000 కస్టమర్ సర్వీస్ పాయింట్లు తెరవాలని యోచిస్తోంది.  చెల్లింపుల బ్యాంకులో ఖాతా తెరిచిన మొట్టమొదటి మిలియన్ కస్టమర్లకు  రు .25,000 డిపాజిట్లపై  రూ.250ల  స్పాట్‌ క్యాష్‌ బ్యాక్‌  అందిస్తామని, అన్ని ఆన్లైన్ లావాదేవీలు ఉచితమని  కంపెనీ తెలిపింది. దీంతోపాటు వినియోగదారులకు రుపే కార్డులు అందిస్తుంది. అలాగే నెలకు ఐదు ఉచిత ఏటీఎం ట్రాన్సాక్షన్స్‌ ఉచితం (నాన్‌ మెట్రో నగరాల్లో) . ఆ తరువాత, వినియోగదారులు  ప్రతి ఉపసంహరణకు రూ. 20 రూపాయలు చెల్లించాలి. తమ బ్యాంక్‌ ఖాతాలను  ఓపెన్‌  చేసెకోవాల్సిందిగా ఇప్పటికే  గత 48 గంటల్లో  2.20 కోట్ల మెసేజ్‌లను  పంపించింది.


మరోవైపు ఎయిర్‌టెల్‌  పేమెంట్‌బ్యాంకు ప్రతి నగదు ఉపసంహరణపై  0.65 శాతం  వసూలు చేస్తుండగా,  ప్రస్తుతం ఉన్న చెల్లింపుల బ్యాంకుల్లో ఇండియా పోస్ట్   మాత్రం  ఇది తన ఖాతాదారులకు భారతదేశం పోస్ట్ ఎటిఎం నుంచి నగదును తీసుకోవడానికి కార్డును అందిస్తోంది.


కాగా దేశంలో మొట్టమొదటి చెల్లింపులన బ్యాంకును ఎయిర్‌ టెల్‌ ప్రారంభించింది. ఆ తర్వాత ఇండియాపోస్ట్‌  ఎయిర్‌టెల్‌ను అనుసరించింది.



 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top