మోదీపై విషం కక్కుతున్న పాక్ మీడియా

మోదీపై విషం కక్కుతున్న పాక్ మీడియా - Sakshi


రక్తం నీరు ఒకేసారి కలిసి ప్రవహించలేవంటూ సింధు నదీ జలాలపై సమావేశంలో భారత ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలు పాక్ పేపర్లలో బ్యానర్లు అయ్యాయి. దీంతోపాటు పాకిస్తాన్ లో రక్తం ఏరులై పారడానికి భారత గూడచర్య సంస్ధ రీసెర్చ్ ఎనాలసిస్ వింగ్(రా) కారణమన్న పాక్ జనరల్ రహీల్ షరీఫ్ వ్యాఖ్యలను కూడా ఆ దేశ పేపర్లు పెద్ద ఎత్తున ప్రచురించాయి. బుర్హాన్ వానీ కాల్చివేత ఘటన తర్వాత నుంచి ఇరుదేశాల మీడియాలు స్పష్టమైన వైఖరితో కథనాలు రాస్తున్నాయి.



భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సుష్మా స్వరాజ్, రా లపై వివిధ పాక్ పేపర్లు చేసిన కామెంట్లు ఇలా ఉన్నాయి.

ఎక్స్ ప్రెస్ ట్రైబ్యూన్

నిజం: ప్రపంచబ్యాంకు భారత్ తో సంప్రదింపులు జరిపి పాకిస్తాన్ తో సింధు నదీ జలాలపై ఒప్పందాన్ని కుదిర్చింది.

రాసింది: ఉడీ ఉగ్రదాడి అనంతరం భారత ప్రధాని పాకిస్తాన్ పై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు రెండు దేశాల మధ్య ఉన్న ఒకే ఒక కీలక ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని చూస్తున్నారు. దీని ద్వారా పాకిస్తాన్ కు చుక్కనీరు కూడా దొరకకుండా చేయడానికి సాహసిస్తున్నారు.



పాకిస్తాన్ అబ్జర్వర్

సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారత్ తనంతట తాను మార్చలేదని(లేదా) రద్దు చేసుకోలేదని రాసింది. 1960లో ప్రపంచబ్యాంకు మధ్యవర్తిత్వం వహించి ఈ ఒప్పందాన్ని కుదిర్చినట్లు పేర్కొంది. సింధు నదీ జలాల ఒప్పందం అతి పవిత్రమైనది పేర్కొన్న అబ్జర్వర్.. ఒప్పందానికి గ్యారెంటీగా ప్రపంచంలో శక్తిమంతమైన ఆర్ధిక వ్యవస్ధలు ఉండటంతో అందులోని కామా, ఫుల్ స్టాప్ లను కూడా భారత్ కదల్చలేదని ఘాటుగా వ్యాఖ్యానించింది.



డావ్న్ న్యూస్

పాకిస్తాన్ లో అత్యంత ప్రాచుర్యం కలిగిన ఈ పేపర్.. పాకిస్తాన్ పార్లమెంటు సమావేశాలు, భారత్ తో సంప్రదింపులను కలిపి ప్రధానవార్తగా ప్రచురించింది. పాక్ తో చర్చలు నిలిపివేయాలని భారత్ నిర్ణయించుకున్నట్లు తెలిసిందని పేర్కొంది. అయితే, దీనిపై భారత్ ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదని తెలిపింది.



డైలీ టైమ్స్

జనరల్ రహీల్ షరీఫ్ 'రా' పై చేసిన కామెంట్లను ప్రధాన వార్తగా ప్రచురించింది. కశ్మీర్ లో కల్లోలాలకు కారణం ఇండియన్ ఆర్మీకు చెందిన 'రా' దేనని ప్రచురించింది. అమాయక ప్రజల రక్తం చిందించడమే వారి లక్ష్యమని రాసింది. సుష్మా స్వరాజ్ స్పీచ్ ను కూడా మొదటి పేజీలో ప్రచురించిన టైమ్స్.. కశ్మీర్ ఆశలను పాక్ వదులుకోవాలని భారత్ చెబుతోందని పేర్కొంది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top