టీజింగ్‌పై కదంతొక్కిన గ్రామస్తులు


జాతీయ రహదారి దిగ్బంధం

లాఠీచార్జి, 15మందికి గాయాలు


 

కోహీర్: ఈవ్‌టీజింగ్‌పై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన యువకులపై తక్షణం చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం చేసిన రాస్తారోకో ఉద్రిక్తతకు దారి తీసింది.  మెదక్ జిల్లా కోహీర్ మండలం చింతల్‌ఘాట్‌కు చెందిన ఓ విద్యార్థిని జహీరాబాద్‌లోని ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. సోమవారం బస్సులో అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో ఆమెకు గొడవ జరిగింది. అదే రోజు సాయంత్రం విద్యార్థిని కోహీర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బుధవారం ఉదయం ఆ యువకుడు మిత్రులతో కలసి చింతల్‌ఘాట్ బస్టాప్ వద్దకు వచ్చి దూషిస్తూ సదరు విద్యార్థిని వెంట్రుకలు పట్టుకొని లాగారు.



వారింటికి వెళ్లి అంతు చూస్తామని బెదిరించారు. పోలీసులు సకాలంలో చర్యలు తీసుకొని ఉంటే ఆకతాయిలు రెచ్చిపోయే వారు కాదని కోపోద్రిక్తులైన విద్యార్థిని కుటుంబ సభ్యులు గ్రామస్తుల సహకారంతో చింతల్‌ఘాట్ చౌరస్తా వద్ద 65 నంబరు జాతీయ రహదారిని దిగ్బంధించారు. దీంతో 2 గంటలపాటు ట్రాఫిక్ పూర్తిగా స్తంభింది. పోలీసులు లాఠీచార్జి చేయగా 15 మంది గాయపడ్డారు. మనస్తాపం చెందిన విద్యార్థిని సోదరుడు రమేష్ ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు.

 

 



 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top