క్యూబా కొత్త తరంపై అమెరికా దృష్టి: ఒబామా

క్యూబా కొత్త తరంపై అమెరికా దృష్టి: ఒబామా


వాషింగ్టన్: క్యూబాతో దశాబ్దాల వైరానికి ముగింపు పలికే దిశగా పలు నిర్ణయాలు తీసుకున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇప్పుడు క్యూబా కొత్త తరంపై దృష్టి సారించారు. క్యూబా కొత్త తరాన్ని ప్రభావితం చేయడానికి ఇదే మంచి తరుణమని ఆయన భావిస్తున్నారు. క్యూబాలో ఫిడెల్ క్యాస్ట్రో ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఐదు దశాబ్దాలుగా తమ దేశం చేసిన ప్రయత్నాలు ఫలించలేదని పేర్కొన్నారు.



ఆ దేశంతో దగ్గరి సంబంధాలు పెట్టుకోవడం ద్వారా కొత్త తరాన్ని ప్రభావితం చేయొచ్చని 'సీఎన్ఎన్' ఇంటర్వ్యూలో ఒబామా చెప్పారు. ఈ ఐదు దశాబ్దాల్లో కొత్త తరం అవతరించిందని అన్నారు.  కాలం చెల్లిన వైఖరిని పక్కనబెట్టి.. పరస్పర ప్రయోజనాలు లక్ష్యంగా క్యూబాతో సంబంధాలను రూపొందించుకోవాలని నిర్ణయించినట్లు ఆయన ఇంతకుముందు ప్రకటించారు. అమెరికా నిర్ణయంపై భారత్ సహా పలు ప్రపంచ దేశాలు హర్షం వ్యక్తం చేశాయి.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top