పాత సిమ్‌కార్డులతో జర జాగ్రత్త

పాత సిమ్‌కార్డులతో జర జాగ్రత్త - Sakshi

మహబూబ్‌నగర్‌ క్రైం: ఏవరి వద్ద చూసిన రెండు లేదా అంతకంటే ఎక్కువ సిమ్ కార్డులు ఉంటాయి. ప్రస్తుతం మహబూబ్‌నగర్‌ నియోజకవర్గంలో జనాభా సంఖ్య 7లక్షలు ఉంటే.. 6లక్షలమేర వివిధ కంపెనీల ఫోన్లు విని యోగిస్తుంటే..8లక్షల సిమ్‌కార్డులను వాడుతున్నారు. ఒకప్పుడు కేవలం 3లక్షలలోపు పరిమితమైన ఈ సంఖ్య గడిచిన మూడేళ్ల కాలంలో ఈ స్థాయిలో పెరిగింది. ఇది ఆయా కంపెనీలకు శుభవార్త అయినప్పటికీ.. ఒక్కొక్కరు మూడు నుంచి నాలుగు సిమ్‌కార్డులు వినియోగించటం అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.

 

ఉచితం పెరిగింది..

గడిచిన నాలుగైదేళ్ల నుంచి సిమ్‌కార్డులను పలు కంపెనీలు ఉచితంగా అందించాయి. దీనివల్ల ఒక్కొక్కరు ఒకే కంపెనీకి చెందిన ఐదు సిమ్‌లను కూడా తీసుకుంటున్నారు. గతంలో రూ.500 చెల్లించిన సిమ్‌కార్డు దొరికేది కాదు. పోటీలో కంపెనీలు ఆఫర్స్‌ ప్రకటించడంతో పాటు అంతర్జాల సేవల వినియోగం పెరగటంతో అమాంతం సిమ్‌కార్డుల విక్రయాలు పెరిగాయి.

 

దుర్వినియోగం

ఇష్టారాజ్యంగా సిమ్‌కార్డులను జారీ చేయడంతో అంతకు రెండింతలు దుర్వినియో గం అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రధానంగా నేరాలకుపాల్పడే వారితో పాటు ప్రముఖులకు బెదిరింపు కాల్‌ చేసేవారు ఎటువంటి ఆధారాలు లేకుండా సిమ్‌కార్డులు పొందుతున్నారు. అదేలా సాధ్యమన్నది గతంలో అందరినీ ఆశ్చర్యంలోకి నెట్టేసింది. కానీ తాజాగా తప్పుడు పేర్లమీద సీమ్‌కార్డులు తీసుకొని నేరాలు చేసే వారి సంఖ్య క్రమంగా పెరిగిపోతుంది. ఈ క్రమంలో కొత్త సిమ్‌కార్డు కొనుగోలు చేసే సమయంలో పాత సిమ్‌కార్డును బ్లాక్‌ చేయకపోతే చేయని నేరంలో ఇరుక్కునే అవకాశం ఉంది.   
Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top