ఉత్తర కొరియాలో తొలిసారిగా..

ఉత్తర కొరియాలో తొలిసారిగా..


జెనీవా: ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని మానవ హక్కుల బృందాన్ని తమ దేశ పర్యటనకు ఉత్తర కొరియా అంగీకారం తెలిపింది. కేటలినా డివన్‌డాస్‌ అగిలర్‌ నేతృత్వంలోని హక్కుల బృందం ఆ దేశంలో వివిధ కారణాలతో వైకల్యం పొందిన పౌరుల స్థితిగతులపై అధ్యయనం చేయనుంది. ఇప్పటి వరకు కొరియా అంతర్జాతీయ స్థాయిలో ఓ పౌర హక్కుల సంఘాన్ని తమ దేశ పర్యటనకు అనుమతించలేదు.



‘ప్రస్తుతం అధికారంలో ఉన్న డీపీఆర్‌కే (డెమోక్రాటిక్‌ పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియా) అక్కడి పరిస్థితులను అంచనా వేయడానికి మాకో ఓ అవకాశం కల్పించింది. అందుకు నా ఆరు రోజుల పర్యటనను పూర్తిగా వినియోగిస్తా’ అని కేటలినా అన్నారు. వచ్చే వారంలో ఈ పర్యటన ఉంటుందని చివరి రోజున నివేదికను ఆ దేశ రాజధాని ప్యాంగ్‌యాంగ్‌లో మీడియా ముందు ప్రవేశ పెట్టనున్నట్లు ఆమె తెలిపారు. యూఎన్‌ ప్రకారం కొరియా లక్షాఇరవైవేల మంది ఖైదీలను సైనిక శిబిరాల్లో క్రూరంగా హింసించిందని అంచనా. 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top