కబాలీలో పంచ్ డైలాగ్స్ ఉండవు

కబాలీలో పంచ్ డైలాగ్స్ ఉండవు


సూపర్‌స్టార్ రజనీకాంత్ చిత్రం అంటేనే సంచలనాలకు నిలయం. ఆయన చిత్రం ప్రారంభం అయ్యిందంటేనే ఎప్పుడెప్పుడు విడుదలవుతుందాని ఎదురు చూసే కళ్లు ఎక్కువే. కబాలి చిత్రం అలాంటి ఎదురు చూపులు నెలకొన్నాయి.

 

సూపర్‌స్టార్ తాజా చిత్రం కబాలి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.ఇటీవలే స్థానిక రాయపేటలోని రష్యన్ కల్చరల్ సెంటర్‌లో షూటింగ్ కార్యక్రమాలను ప్రారంభించున్న ఈ క్రేజీ చిత్రాన్ని కలైపులి ఎస్.థాను భారీ ఎత్తున నిర్మిస్తున్న విషయం విదితమే. మెడ్రాస్ చిత్రం ఫేమ్ రంజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రాధిక ఆప్తే కథానాయిక గా నటిస్తున్నారు. చిత్రం షూటింగ్ నగరంలోని కొన్ని నక్షత్ర హోటళ్లలో,ప్రత్యేక అనుమతితో చెన్నై విమానాశ్రయంలోనూ నిర్వహించారు. మరి కొన్ని రోజులు చెన్నైలో చిత్రీకరణ జరుపుకుని తొలి షెడ్యూల్ పూర్తి చేసుకోనుంది. కాగా ఈ నెల 19 నుంచి మలేషియాలో రెండవ షెడ్యూల్‌కు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నారని సమాచారం.

 

 కబాలీలోనే పంచ్ ఉంది

 పంచ్ డైలాగులకు పెట్టింది పేరు సూపర్‌స్టార్. దీంతో కబాలి చిత్రంలో పలు పంచ్ డైలాగ్స్ ఉంటాయని భావించడం న్యాయమే. అయితే ఈ చిత్రంలో సూపర్‌స్టార్ కంటూ ప్రత్యేకంగా పంచ్ డైలాగ్స్ ఉండవంటున్నారు ఆ చిత్ర దర్శకుడు రంజిత్.దీని గురించి ఆయన తెలుపుతూ ఉత్తర చెన్నైలో రౌడీలు ఉంటారంటారన్నారు. నిజానికి వారు చెడ్డవారు కారని పేర్కొన్నారు. ప్రజలకు,సమాజానికి మంచి చేయడం కోసమే ఆ రౌడీలనే వారిని ఉపయోగించుకుంటారన్నారు.

 

అలాంటి ఒక పాత్రలో రజనీకాంత్ కబాలి చిత్రంలో నటిస్తున్నారని తెలిపారు.ఈ పాత్ర కోసం గడ్డం, మీసాలు పెంచాలని చెప్పగా రజనీ వెంటనే ఒప్పుకున్నారని చెప్పారు.పెద్దగా మేకప్ కూడా లేకుండా ఆయన తన వయసుకు తగ్గ పాత్రను పోషిస్తున్నార ని తెలిపారు.అంతేకాదు ఈ పాత్ర కోసం రజనీ బరువు తగ్గారని తెలిపారు.మహేంద్రన్ దర్శకత్వం వహించిన ముల్లుమ్ మలరుమ్ చిత్రంలో రజనీకాంత్ నటించి పాత్ర తనకు చాలా నచ్చిందన్నారు.

 

అందులో ఒక చెయ్యి కోల్పోయిన ఆయన రెండు చేతులు,రెండు కాళ్ళు పోయినా ఈ కాళీ బతికేస్తాడు.చెడ్డవాడు సార్ ఈ కాళీ అనే డైలాగ్ చెబుతారన్నారు.అలాంటి వేగం ఈ కబాలి చిత్రంలో ఉంటుందని చెప్పారు.చిత్ర టైటిల్‌లోనే పంచ్ ఉండడంతో చిత్రంలో రజనీకాంత్ కంటూ ప్రత్యేకంగా పంచ్ డైలాగ్స్ ఉండవు అని దర్శకుడు తెలిపారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top