కోర్టుల్లో ‘జనగణమన’కు నో..!

కోర్టుల్లో ‘జనగణమన’కు నో..! - Sakshi


న్యూఢిల్లీ: దేశంలోని అన్ని సినిమా హాళ్లలో జాతీయ గీతాన్ని ఆలపించాలని, ఈ మేరకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఆదేశించిన సుప్రీంకోర్టు.. అదే అంశానికి చెందిన మరో పిటిషన్ పై దిగ్భాంతికమైన తీర్పు చెప్పింది. దేశంలోని అన్ని కోర్టుల్లో కార్యకలాపాలు మొదలు కావడానికి ముందు ‘జనగణమన’ ఆలపించేలా ఆదేశాలివ్వాలన్న వాదనను తిరస్కరించింది. ఈ మేరకు శుక్రవారం కీలక నిర్ణయాన్ని వెల్లడించింది.



సినిమా హాళ్లలో జాతీయ గీతాలాపన ఉత్తర్వులపై తీవ్ర చర్చ జరుతున్న సందర్భంలోనే.. ‘కోర్టుల్లో కూడా ఆ గీతాన్ని తప్పనిసరిగా ఆలపించాలి’ అంటూ ఢిల్లీకి చెందిన ఓ న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. వాదనల అనంతరం శుక్రవారం పిటిషన్ ను కొట్టేసిన న్యాయమూర్తి.. ఇక ముందు ఇలాంటి వాదనలకు తావు ఇవ్వబోమని గట్టిగా వక్కాణించారు. సినిమా హాళ్లలో మాత్రం జాతీయ గీతం పాడాల్సిందేనని మరోసారి స్పష్టం చేశారు. (తప్పక చదవండి: గుండెల్లో దేశభక్తి చాలదా?)

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top