ఇన్ఫోసిస్, టీసీఎస్‌ ప్రాధాన్యం ఇక వారికేనట!

ఇన్ఫోసిస్, టీసీఎస్‌ ప్రాధాన్యం ఇక వారికేనట! - Sakshi


ముంబై: భారతీయ  ఐటీ విద్యార్థుల ప్లేస్‌మెంట్‌  కలలు  ఇక కల్లలుగానే మిగిలిపోనున్నాయి.  అమెరికా అధ్యక్షుడిగా  డొనాల్డ్‌ ట్రంప్‌  శుక్రవారం ప్రమాణ స్వీకారం  చేయనున్న నేపథ‍్యంలో  భారతీయ ఐటీ కంపెనీలు అమెరికా ఉద్యోగులపై  దృష్టిపెట్టనున్నట్టు   నివేదికలు వెల్లడి చేస్తున్నాయి.  ఎకనామిక్ టైమ్స్  నివేదిక ప్రకారం  ప్రముఖ  దేశీయ ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్   ఇక మీదట అమెరికాలోని  ఫ్రెషర్స్‌​ కే ప్రాధాన్యత ఇవ్వనున్నాయి.  అమెరికా లోని   ఇంజనీరింగ​ కాలేజీల్లో క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్లు చేపట్టనున్నాయి.  దీంతో వేలాదిమంది   భారతీయ  ఐటీ విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడనుందని రిపోర్ట్‌ చేసింది.

 

హెచ్‌-1బీ, ఎల్‌1 వీసాల ద్వారా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించి, అధిక ఆదాయం పొందుతున్న భారత ఐటీ కంపెనీలకు పెద్ద ఎదురుదెబ్బ తగలనుందనే  అంచనాలతో కంపెనీలు ఇకమీదట అమెరికా వాసులకే ప్రాధాన్యత ఇవ్వనున్నాయి.  ఇటీవల జెఫ​  సెషన్స్‌​ చేసిన ప్రతిపాదనలను అమెరికన్‌ కాంగ్రెస్‌ ఆమోదిస్తే భారతీయ ఐటీ కంపెనీలకు శరాఘాతమే. ఇక ఈ వీసాల ద్వారా అమెరికాలో ప్రవేశించటం భారతీయ ఐటీ విద్యార్థులకు  దాదాపు కష్టమైనట్లే.



కాగా గత వారం, అటార్నీ జనరల్ పదవికి  ట్రంప్  నామినేట్‌ చేసిన జెఫ్ సెషన్స్ హెచ్‌-1బీ , ఎల్‌1 వీసాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు చర్యలు చేపట్టనున్నట్టు  హెచ్చరించారు.  ఒక అమెరికన్ ఉద్యోగాన్ని విదేశాల్లో తక్కువ జీతంతో పనిచేసే మరొకరితో భర్తీ చేయడం సరైనదేనని భావించడం చాలా తప్పు అని సెనేట్ జ్యుడీషియరి కమిటీ ముందు  జెఫ్  తెగేసి చెప్పారు.  గతంలో సెషన్స్, గ్లాసరీ , సెనేటర్ డిక్ డర్బిన్ హెచ్‌-1బీ, ఎల్‌1  వీసా  సంస్కరణ బిల్లును సహ స్పాన్సర్ చేసిన సంగతి తెలిసిందే.

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top