'ఆ చిత్రాని'కి బాహుబలికి పోలికే లేదు

'ఆ చిత్రాని'కి బాహుబలికి పోలికే లేదు - Sakshi


ముంబై: తాను తీసిన చిత్రాల్లోని నటీనటులు రియల్ లుక్లో కనబడే విధంగా చిత్రాలు తీస్తానని టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి వెల్లడించారు. అందుకోసం ఎప్పుడు ఎక్కడ 3డీ ఫార్మెట్ను ఉపయోగించలేదని తెలిపారు. తన దర్శకత్వంలో తెరకెక్కి.. విడుదలకు సిద్ధంగా ఉన్న  బాహుబలి చిత్రంలో కూడా ఈ ఫార్మెట్ను ఉపయోగించలేదన్నారు.


3డీ ఫార్మెట్ తాను అంతగా ఇష్టపడనని తెలిపారు. బాహుబలి చిత్రం ప్రమోషన్ కోసం గురువారం ముంబయి వచ్చిన రాజమౌళి విలేకర్లతో ముచ్చటించారు. ఆ ఫార్మెట్ ఉపయోగించడం వల్ల కలిగే ఇబ్బందులను రాజమౌళి వివరించారు. బాహుబలిలో సన్నివేశాలు స్పెషల్ ఎఫెక్ట్స్తో చాలా బాగా వచ్చాయని బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ ప్రశంసల జల్లు కురిపించిన సంగతిని ఈ సందర్భంగా రాజమౌళి వద్ద విలేకర్లు ప్రస్తావించారు.


దీనిపై ఆయన స్పందిస్తూ... అమితాబ్ ప్రశంసలు సంతోషాన్ని కలిగించిందన్నారు. ఈ చిత్రం చూసి దక్షిణాది ప్రేక్షకులు ఇదే విధంగా స్పందిస్తారని చెప్పారు. అలాగే బాహుబలి హిందీ వెర్షన్ చూసి ఇక్కడి ప్రేక్షకులు కూడా సంతోషిస్తారని రాజమౌళి ఆశాభావం వ్యక్తం చేశారు.



అయితే బాహుబలి చిత్రానికి హలీవుడ్ బ్లాక్ బస్టర్ 300 చిత్రానికి పోలికలు ఉన్నాయంటూ విలేకర్లు లేవనెత్తిన ప్రశ్నలకు రాజమౌళి సమాధాన మిచ్చారు. బాహుబలి చిత్రానికి... హాలీవుడ్ చిత్రం 300 మధ్య పోలికే లేదన్నారు. బాహుబలి ప్రత్యేక చిత్రమని అన్నారు.  ఆ రెండు చిత్రాల మధ్య పోలిక ఎలా ఏర్పడిందో తెలియదన్నారు.


కాగా తన దర్శకత్వంలో వచ్చే చిత్రాలలో హీరో కంటే  విలన్ పాత్రలు మరింత శక్తిమంతంగా.. పెద్దగా ఉండేలా ప్రయత్నిస్తానని చెప్పారు. అలాగే సినిమాలు నిర్మిస్తానని చెప్పారు.  అందుకు రామ్చరణ్, కాజల్ హీరోహీరోయిన్లుగా తన దర్శకత్వంలో వచ్చిన మగధీర చిత్రాన్ని ఈ సందర్భంగా రాజమౌళి ఉదాహరించారు. ఇటీవల ముంబైలో బిగ్ బీ అమితాబ్ బాహుబలి చిత్రం ట్రైలర్ చూశారు.  ఈ చిత్రం చాలా బాగుందంటూ అమితాబ్ కితాబ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top