మద్యం ప్రియులకు కిక్కు..నితీష్కు షాక్

మద్యం ప్రియులకు కిక్కు..నితీష్కు షాక్

న్యూఢిల్లీ : బిహార్ను సంపూర్ణ మద్య నిషేధంగా మలుస్తానని ప్రకటించిన నితీష్ ప్రభుత్వానికి పట్న హైకోర్టు షాకిచ్చింది. యాంటీ-లిక్కర్ యాక్ట్ చట్టవిరుద్ధమని తేల్చేసింది .ఆ చట్టాన్ని నిలిపివేస్తున్నట్టు గురువారం ఆదేశాలు జారీచేసింది. సంపూర్ణంగా మద్యం నిషేధిస్తూ  ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిహార్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ బిల్లు-2016ను పట్నా హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఈ చట్టం ప్రకారం ఎవరి ఇంట్లోనైనా లిక్కర్ బాటిల్ కనిపిస్తే ఆ కుటుంబంలోని పెద్దలందరినీ అరెస్టు చేసే అవకాశముంటుంది. ఈ చట్టానికి బిహార్ ఉభయ సభలు ఈ బిల్లును ఆమోదం తెలిపాయి. చట్టసభల ఆమోదం తర్వాత నెలకే ఆ రాష్ట్ర గవర్నర్ రామ్నాథ్ కోవింద్ కూడా ఈ పాలసీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆగస్టు 1నుంచి ఆ రాష్ట్రంలో సంపూర్ణ మద్యం పాలసీ అమల్లోకి వచ్చింది. కానీ ఆ చట్టాన్ని తప్పుపడుతూ చట్టవిరుద్ధమని పట్న హైకోర్టు తీర్పునిచ్చింది.

 

ఈ కొత్త బిల్లులోని సెక్షన్లలన్నింటిలోనూ బెయిల్ లభించదు. కేవలం కోర్టులు మాత్రమే బెయిల్ మంజూరు చేయగలవు. ఈ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి కేవలం స్పెషల్ కోర్టులు మాత్రమే మద్య నిషేధ ఉల్లంఘన కేసులను విచారించగలవు. ఈ స్పెషల్ కోర్టులు ఇప్పటివరకు అవినీతి, సీబీఐకు సంబంధించిన కేసుల విచారణలోనే ఊపిరి సలుపుకోకుండా ఉన్నాయి.ఈ చట్టంలో మరో కఠినమైన నిబంధనన ఏమిటంటే, ఏ ప్రాంతంలోనైనా బెల్లం, ద్రాక్షపండ్లు కనిపించినా సరే లిక్కర్ తయారు చేస్తున్నట్టు భావించి అరెస్ట్ లు చేసే అధికారం ముంటోంది. ఈ బిల్లుపై పలువురు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.
Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top