5 నెలల గరిష్టానికి మార్కెట్లు.నిఫ్టీ@8900


ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌100 పాయింట్ల లాభంతో 28,761 వద్ద నిఫ్టీ 29  పాయింట్ల లాభంతో 8907 వద్ద ముగిసింది.  ఆరంభంనుంచి స్తబ్దుగా ఉన్న మార్కెట్లలో మిడ్‌ సెషన్‌ నుంచీ  కొనుగోళ్లు జోరందుకున్నాయి. దీంతో నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన 8,900ను అధిగమించింది. అలాగే మరోసారి  5 నెలల గరిష్తాన్ని మార్కెట్లు తాకాయి.  అలాగే 2016 సెప్టెంబర్‌ 9 తరువాత మళ్లీ 8,900 స్థాయిని నమోదు చేయడం విశేషం.  ఫిబ్రవరి డెరివేటివ్స్‌ గురువారం ముగియనున్నప్పటికీ ట్రేడర్లు కొనుగోళ్లకు ఆసక్తి  చూపినట్టు విశ్లేషకులు పేర్కొన్నారు. నిఫ్టీ 8.950 స్థాయిలలో కొంత నిరోధకతను కలిగి ఉందని పేర్కొన్నారు.


నిఫ్టీ బ్యాంక్‌ ,  మెటల్‌, రియల్టీ రంగాలు పాజిటివ్‌గా ముగిశాయి.  మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌, బ్యాంక్‌ నిఫ్టీ  రికార్డ్‌ హైని తాకాయి. అరబిందో, టెక్‌ మహీంద్రా, గ్రాసిమ్‌, ఏషియన్‌ పెయింట్స్‌ , జెట్‌ ఎయిర్‌ వేస్‌  లాభపడగా, ఇన్ఫ్రాటెల్‌ 4 శాతం పతనమైంది. మిగిలిన బ్లూచిప్స్‌లో భారతీ, టీసీఎస్‌, ఐటీసీ, సన్‌ ఫార్మా నష్టపోయాయి.


ముఖ్యంగా  రిలయన్స్‌ జియో ప్రకటనతో ముఖ్యంగా  ఏప్రిల్ నుంచి సభ్యులకు టారిఫ్ ప్లాన్స్‌పై రాయితీ ప్రకటించించడంతో టెలికాం స్టాక్స్  ఒక శాతం డౌన్  అయ్యాయి. ఐడియా సెల్యులార్ క్షీణించగా , భారతి ఎయిర్టెల్ టాప్‌  లూజర్‌గా నిలిచింది. ఇండెక్స్ హెవీవెయిట్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్  కూడా బైబ్యాక్ ఆఫర్ ప్రాంతంలో నిన్నర్యాలీ తర్వాత నేడు 1 శాతం పైగా పడిపోయింది.




డాలర్‌ తోపోలిస్తే రూపాయి 0.10 పైసలు లాభపడి రూ.66.92వద్ద నిలవగా, పసిడి బలహీనత  ఈ రోజు కూడా కొనసాగింది. ఎంసీఎక్స్‌ మార్కెట్‌ లో పది గ్రా.పుత్తడి రూ.154 నష్టపోయి రూ.29,149 వద్ద ఉంది.

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top