శృంగారనుభవానికి ఓ యాప్
న్యూయార్క్: సాంకేతిక రంగంలో 'యాప్' లు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. అమెరికాలో కాలేజీ యువతను లక్ష్యంగా చేసుకుని మరో విభిన్న యాప్ అందుబాటులోకి వచ్చింది. పరసర్ప అంగీకారంతో లైంగికానుభవం పొందాలనుకునే వారికోసం 'గుడ్2గో' పేరుతో యాప్ తయారుచేశారు. ఐఫోన్, ఆండ్రాయిడ్, డివైసెస్ లలో దీన్ని పొందుపర్చుకోవచ్చు.
క్యాంపస్ లో లైంగిక వేధింపుల నుంచి యువతను బయటపడేసేందుకు ఈ యాప్ ను రూపొందించినట్టు డెవలపర్ లీ ఆన్ అల్మాన్ తెలిపారు. పరస్పర అంగీకారంతో శృంగారనుభవం పొందాలనుకునే యువత సందేహాలకు, భయాలకు ఈ యాప్ లో సమాధానం దొరకుతుందన్నారు. ఈ యాప్ లోకి వెళ్లగానే... ఆర్ వియ్ గుడ్2గో అని అడుగుతుంది. యస్ అని సమాధానమిస్తే.. మీతో మాట్లాడాలంటోంది. నో అని జవాబిస్తే ఇక ముందుకెళ్లలేరు.