'ఆయన గూగుల్ సీఎంగా ప్రసిద్ధికెక్కుతారు'


హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావుపై బీజేపీ సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు సంధించారు. 'కేసీఆర్ది మాటల ప్రభుత్వం, గూగుల్ సీఎంగా ప్రసిద్ధికెక్కుతారు. నిజాం గిరి చేస్తానంటే నడవదు. అబ్దుల్ కలాం అంత్యక్రియలకు హాజరు కానీ సీఎం డీఆర్డీవోకు ఆయన పేరు పెట్టడం హాస్యాస్పదం. తెలంగాణ మంత్రులు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారు' అంటూ ఆయన సోమవారమిక్కడ ధ్వజమెత్తారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ పథకాలతో పేదలకు లబ్ధి చేకూరిందని నాగం అన్నారు.

 

 
Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top