ప్రపంచంలో అత్యంత చౌకైన నగరం ...

ప్రపంచంలో అత్యంత చౌకైన నగరం ...


లండన్ : ప్రపంచంలో అత్యంత చౌకైన నగరం  ఏదైనా ఉందంటే అది ముంబై నగరమేనంటా. జీవించేందుకే కాదు.... పని చేసేందుకు కూడా ఈ నగరం అత్యంత చౌకైన నగరంగా నిలిచింది. ఈ మేరకు సవిల్స్ వరల్డ్ రిసెర్చ్ సంస్థ శనివారం వెల్లడించింది. లండన్, హాంకాంగ్, న్యూయార్క్ ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలు అని తెలిపింది. న్యూయార్క్, హాంకాంగ్, సీడ్ని ప్రపంచ నగరాలకు ఉన్న ఔనత్యం, పెట్టుబడులు తదితర అంశాలన్నీ భారత్లోని ఈ మహానగరానికి వర్తించాయని తమ సర్వేలో తెలిందని ఆ సంస్థ సంచాలకుడు యెలాండీ బర్నిస్  లండన్లో వెల్లడించారు.



న్యూయార్క్, హాంకాంగ్, సీడ్ని నగరాల్లో ఉద్యోగులకు వసతులు కల్పించడానికి ఆయా సంస్థలు భారీగా ఖర్చు చేస్తున్నాయని చెప్పారు. అయితే లండన్ నగరం మాత్రం అత్యంత ఖరీదైన నగరాలకే నగరమని  చెప్పారు. ఆ నగరంలో ఖర్చుకు ఆకాశమే హద్దు అన్నారు. ఖరీదైన నగరాల్లో జీవితం, పని... రెండు ఉత్పదికతకు అనుబంధంగా ఉంటుంది.


 


అందువల్ల చౌకైన నగరాల్లో కంటే ఖరీదైన నగరాల్లో జీడీపీ ఐదురెట్లు ఆధికంగా ఉంటుందని స్పష్టం చేశారు. అయితే చౌకైన నగరాల్లో జీవితం, పని మధ్య సంబంధం అంతగా ఉండదని బర్నిస్ అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో 12 కాస్మోపాలిటిన్ నగరాలను పరిగణలోకి తీసుకుని సవిల్స్ వరల్డ్ రిసెర్చ్ సంస్థ ఈ సర్వే నిర్వహించింది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top