మరింత ఆసక్తికరంగా ఫేస్‌బుక్ ‘లైక్’

మరింత ఆసక్తికరంగా ఫేస్‌బుక్ ‘లైక్’ - Sakshi


భావోద్వేగాలను వ్యక్తీకరించేందుకు కొత్త చిహ్నాలు

 

 న్యూయార్క్: ఫేస్‌బుక్‌లో నచ్చిన ఫొటోను ‘లైక్’ను  చేయడం  మరింత ఆసక్తికరం కానుంది.   ఖాతాదారులు సంతోషం, ప్రేమ, కోపం వంటి భావాలను వ్యక్తీకరించేందుకు ఆరు కొత్త చిహ్నాలను జత చేసింది  ఫేస్‌బుక్. లైక్ ఐకాన్‌పై లాంగ్ ప్రెస్ చేసినట్లయితే ఇవి కనిపిస్తున్నాయి. మనకు నచ్చిన భావాన్ని సందేశంలో చేర్చొచ్చు. ఈ కొత్త ఫీచర్లను స్పెయిన్, ఐర్లాండ్ తదితర దేశాల్లో ఫేస్‌బుక్ పరీక్షిస్తోంది. త్వరలో అంతర్జాతీయంగా అందుబాటులోకి తీసుకురానుంది.



కొత్త ఫీచర్ల  వివరాలను ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బెర్గ్ తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో వెల్లడించారు. మీ భావాలను కొత్తగా వ్యక్తీకరించండి.. అంటూ హహా.. యాయ్.. వావ్.. శాడ్.. యాంగ్రీ.. అలాగే లైక్.. లవ్ చిహ్నాలతో కూడిన వీడియోను అందులో పోస్ట్ చేశాడు. డిస్‌లైక్ బటన్ ఇంకా సిద్ధం కాలేదన్నాడు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top