శెభాష్‌: మన మిథాలీకి అరుదైన గౌరవం!

శెభాష్‌: మన మిథాలీకి అరుదైన గౌరవం!


లండన్‌: భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌కు అరుదైన గౌరవం దక్కింది. 2017 ఐసీసీ మహిళా వరల్డ్‌ కప్‌ జట్టు కెప్టెన్‌గా ఆమెను ఐసీసీ ఎంపిక చేసింది. తాజాగా ముగిసిన వరల్డ్‌ కప్‌లో భారత జట్టును తన నాయకత్వంలో ఫైనల్‌కు చేర్చిన 34 ఏళ్ల మిథాలీకి ఈ గొప్ప గౌరవాన్ని కట్టబెట్టింది. ఆదివారం లార్డ్స్‌లో ఆద్యంతం ఉత్కంఠగా జరిగిన ఫైనల్‌ పోరులో తొమ్మిది పరుగుల తేడాతో భారత జట్టు ఓడిపోయిన సంగతి తెలిసిందే.



కెప్టెన్సీకి మారుపేరుగా నిలిచిన మిథాలీ బ్యాటింగ్‌లోనూ అసాధారణంగా రాణించి 409 పరుగులు చేసింది. అత్యంత కీలకమైన న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో 109 పరుగులు చేసి జట్టుకు 186 పరుగుల భారీ విజయాన్ని అందించింది. ఈ విజయంతో భారత్‌ సెమీస్‌ బెర్తును ఖాయం చేసుకుంది. మిథాలీతోపాటు అద్భుతంగా రాణించిన భారత మహిళా క్రికెటర్లు హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, దీప్తిశర్మ కూడా ప్రపంచకప్‌ జట్టులో చోటు సంపాదించారు. తాజా వరల్డ్‌ కప్‌లో అద్భుతంగా రాణించిన క్రికెటర్ల గౌరవార్థం ప్రకటించిన ప్రపంచకప్‌ జట్టులో నలుగురు ఇంగ్లండ్‌ క్రికెటర్లు చోటు సంపాదించుకున్నారు.




ఐసీసీ ప్రకటించిన మహిళ ప్రపంచకప్‌ జట్టు ఇది.. (బ్యాటింగ్‌ ఆర్డర్‌ ప్రకారం)

తమ్సిన్ బ్యూమొంట్ (ఇంగ్లండ్) - 410 పరుగులు

లారా వోల్వార్డ్ (దక్షిణాఫ్రికా) - 324 పరుగులు

మిథాలీ రాజ్ (కెప్టెన్) (ఇండియా) - 409 పరుగులు

ఎల్లీ పెర్రి (ఆస్ట్రేలియా) - 404 పరుగులు, తొమ్మిది వికెట్లు

సారా టేలర్ (వికెట్ కీపర్) (ఇంగ్లండ్) - 396 పరుగులు, నాలుగు క్యాచ్‌లు, రెండు స్టంపింగ్లు

హర్మాన్‌ ప్రీత్ కౌర్ (ఇండియా) - 359 పరుగులు, ఐదు వికెట్లు

దీప్తీశర్మ (ఇండియా) - 216 పరుగులు మరియు 12 వికెట్లు

మారిజన్నె కప్ (దక్షిణాఫ్రికా) - 13 వికెట్లు

అలెక్స్ హార్ట్లీ (ఇంగ్లండ్) - 10 వికెట్లు

నాటాలిసైవర్ (12వ ప్లేయర్‌) (ఇంగ్లండ్) - 369 పరుగులు, ఏడు వికెట్లు

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top