మాజీమంత్రి లైంగికంగా వేధించారనే పొడిచేశా!

మాజీమంత్రి లైంగికంగా వేధించారనే పొడిచేశా! - Sakshi


బీహార్లో ఒక మాజీ మంత్రి మీద ఇటీవల దాడి జరిగింది. ఓ వ్యక్తి సదరు మాజీ మంత్రిని కత్తితో పొడిచాడు. దాంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అయితే.. మాజీ మంత్రి ఎజాజ్ ఉల్ హక్ తనను లైంగికంగా వేధించారని, సెక్స్లో పాల్గొనాల్సిందిగా బలవంతం చేశారని, అందుకే కోపంతో ఆయన మీద దాడి చేశానని నిందితుడు పోలీసులకు తెలిపాడు. ప్రస్తుతం జైల్లో ఉన్న మాజీ ఎంపీ మహ్మద్ షహాబుద్దీన్కు సమీప బంధువైన హక్ను గత శుక్రవారం ఆయన ఫ్లాట్లోనే కత్తితో పొడవడంతో ఆయన ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.



నిందితుడు రాఘవేంద్ర కుమార్ను అరెస్టు చేసినట్లు సీనియర్ ఎస్పీ వికాస్ వైభవ్ చెప్పారు. రాఘవేంద్ర వద్ద హక్ను పొడిచిన కత్తితో పాటు.. ఆయన వద్ద నుంచి చోరీ చేసిన రివాల్వర్ కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. హక్ తనను పదే పదే లైంగికంగా వేధించడంతో తాను విసిగిపోయానని, గత శుక్రవారం రాత్రి కూడా ఆయన తనపై లైంగిక దాడి చేయబోయారని.. అందుకే పొడిచానని రాఘవేంద్ర కుమార్ పోలీసులకు విచారణలో తెలిపాడు. రబ్రీదేవి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2000 నుంచి 2005 మధ్య హక్ మంత్రిగా పనిచేశారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top