వామపక్షాల ర్యాలీ హింసాత్మకం


కోల్కతా: రైతుల సమస్యలపట్ల ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ వామపక్షాలు గురువారం కోల్కతాలో నిర్వహించిన ర్యాలీ హింసాత్మక రూపం దాల్చింది. రైతులంతా నిరసనకారులుగా మారగా పోలీసులు వారిని అడ్డుకునే చర్యలకు దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొని పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. వామపక్ష నేతలు, కార్యకర్తలు, రైతుల్లో చాలామంది గాయపడ్డారు.



ఈ నేపథ్యంలో రాష్ట్ర సీపీఎం సెక్రటరీ సూర్జ్యా కాంత మిశ్రాను, లెఫ్ట్ ఫ్రంట్ చైర్మన్ , ప్రముఖ మావోయిస్టునేత బిమన్ బోస్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల చర్యపట్ల వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ తమను ఒక ఆందోళనకారులుగా భావించి పోలీసులు ఇటుకలతో కొట్టారని ఆరోపించారు. దాదాపు 100 మంది ఇందులో గాయాలపాలయ్యారు.  ఇదిలా ఉండగా, ఈ ర్యాలీ పట్ల ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేసింది. అసలు ఈ వామపక్షాల ర్యాలీకి ఒక డిమాండ్, లక్ష్యం ఏమి లేదని అన్నారు. ర్యాలీకి వచ్చేవారు ఇటుకలు, బాంబులతో వస్తారా.. అలాంటి చర్యలు ఈరోజు వామపక్షాలు చేశాయి అని ఆరోపించారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top