‘లవ్‌ జీహాద్‌’ కేసులో కీలక మలుపు

షఫిన్ జహాన్‌తో అఖిల అశోకన్(ఫైల్‌ ఫొటో) - Sakshi


- ఎన్‌ఐఏ దర్యాప్తునకు ఆదేశించిన సుప్రీం ధర్మాసనం



న్యూఢిల్లీ:
హిందూ యువతి- ముస్లిం యువకుడి పెళ్లిపై నమోదయిన ‘లవ్‌ జిహాద్‌’ కేసు కీలక మలుపు తిరిగింది. దీనికి సబంధించి దర్యాప్తు బాధ్యతను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)కు అప్పగిస్తూ సుప్రీం ధర్మాసనం బుధవారం ఆదేశాలు జారీచేసింది. కేరళలో చోటుచేసుకున్న ఈ ఉదంతాన్ని ప్రత్యేకమైన కేసుగా పరిణిస్తున్నట్లు కోర్టు ఇదివరకే చెప్పిన సంగతి తెలిసిందే.



కాగా, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆర్.వి.రవీంద్రన్‌.. ఎన్‌ఐఏ దర్యాప్తు తీరును పర్యవేక్షిస్తారని చీఫ్‌ జస్టీస్‌ జేఎస్‌ ఖేహర్‌, జస్టీస్‌ డీవై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ విషయంలో అత్యున్నత న్యాయస్థానం ఎన్ఐఏ దర్యాప్తునకు ఆదేశిస్తే తమకెలాంటి అభ్యంతరం లేదని కేరళ ప్రభుత్వం కూడా కోర్టుకు తెల్చిచెప్పిన దరిమిలా నేటి ఆదేశాలు వెలవడ్డాయి.



కేరళకు చెందిన అఖిల అశోకన్ అనే యువతిని  ఇస్లాం మతంలోకి మార్చి  షఫిన్ జహాన్ అనే ముస్లిం యువకుడు పెళ్లి చేసుకోవడాన్ని ‘లవ్‌ జిహాద్‌’గా భావించిన హైకోర్టు.. వివాహాన్ని రద్దు చేసింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మహిళ భర్త సుప్రీం కోర్టును ఆశ్రయించారు. పెద్దవాళ్ల ఇష్టానికి వ్యతిరేకంగా హిందూ బాలికలను ఇస్లాంలోకి మార్చిన పలు సందర్భాలు ఉన్నాయన్న ప్రాసిక్యూటర్‌ వాదనతో ఏకీభవించిన ధర్మాసనం.. ఎన్‌ఐఏ దర్యాప్తునకు ఆదేశించింది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top