జూపూడి ఔట్...ప్రతిభ ఇన్!

జూపూడి ఔట్...ప్రతిభ ఇన్! - Sakshi


హైదరాబాద్: జూపూడి ప్రభాకరరావుకు అదృష్ణం కొద్దిలో మిస్ అయింది. మళ్లీ ఎమ్మెల్సీ ఛాన్స్ మళ్లీ వచ్చినట్టే వచ్చి ఇట్టే చేజారీ పోయింది. ఆ అదృష్టాన్ని ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కె. ప్రతిభ భారతికి కొట్టేశారు. అంతా చివర నిమిషంలో చకచకా జరిగిపోయింది. ఇక వివరాల్లోకి వెళ్లితే. ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి ఎమ్మెల్యేల కోటాలో నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు జూన్ 1వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి.



ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ స్థానానికి జూపూడిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు  ఎంపిక చేశారు. అయితే జూపూడి స్వస్థలం ప్రకాశం జిల్లా అయినా... ఆయన హైదరాబాద్లో స్థిరపడ్డారు. దాంతో ఆయన ఓటు హక్కు కూకట్పల్లిలో ఉంది. ఆ విషయం ఆఖరి నిమిషంతో పార్టీ అధినేతకు తెలిసింది. కాగా శాసనమండలికి పోటి చేసే అభ్యర్థికి సదరు రాష్ట్రంలో ఓటు హక్కు తప్పని సరిగా  ఉండాలి. దాంతో జూపూడికి చేతిలోకి వచ్చిన అదృష్టం... కళ్ల ముందే చేజారింది. కాగా ఆయన స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన ఉత్తరాంధ్ర నేత కావలి ప్రతిభ భారతిని చంద్రబాబు ఎంపిక చేశారు.



జూపూడి అభ్యర్థిగా ఎంపిక చేయడంతో ఆ పార్టీలోని సీనియర్లు కుతూహలమ్మ, వర్ల రామయ్య, జేఆర్ పుష్పరాజ్, మసాల పద్మజ, బల్లి దుర్గా ప్రసాద్ ... అంతా టీడీపీ అధిష్టానంపై గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. అలాగే నిన్న కాక మొన్న వచ్చిన జూపూడికి ఎలా ఇస్తారంటూ ఇప్పటికే ఆ పార్టీలోని సీనియర్లు అంతా చంద్రబాబు నిర్ణయంపై అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. దాంతో అందరి ఆగ్రహంపై నీళ్లు చల్లేందుకు ప్రతిభను బాబు తెరపైకి తీసుకొచ్చారు.



ప్రతిభకి పట్టం కడితే అందరికి అమోదయోగ్యమని బాబు యెచించారు. కానీ ప్రతిభకు ఛాన్స్ ఇస్తే... కృష్ణా జిల్లా నుంచి బరిలోకి దిగుతున్న ఇద్దరు ఎమ్మెల్సీల్లో పంచుమర్తి అనురాధకు ఛాన్స్ మిస్ అయ్యే అవకాశం ఉంది. దాంతో ఆమెను నామినేటేడ్ పోస్ట్లో కుర్చోబెట్టాలని ఇప్పటికే చంద్రబాబు ఓ అంచనాకు వచ్చారని సమాచారం. మరోవైపు జూపూడి ఈ ఛాన్స్ మిస్ అయినా కనీసం గవర్నర్ కోటాలో అయినా ఎమ్మెల్సీ సీటు దక్కుతుందేమో అని వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top