జియో టారిఫ్‌ ప్లాన్స్‌ ఇక షురూ

జియో టారిఫ్‌ ప్లాన్స్‌ ఇక షురూ


ముంబై: దేశవ్యాప్తంగా 4జీ సేవలతో సంచలనం సృష్టించిన రిలయన్స్‌ జియో ఇక ఉచిత సేవలకు టాటా చెప్పేసింది.  కొత్త ప్రేమ్‌ మెంబర్‌ షిప్‌ ప్రోగ్రాం లాంచ్‌ తోపాటు  కొత్త టారిఫ్‌ ప్లాన్లను ప్రకటించారు  రిలయన్స్‌ అధినేత ముకేష్‌ అంబానీ.  మంగళవారం ముంబైలో నిర్వహించిన ప్రెస్‌ మీట్‌ లో  ఆయన కొత్త ఆర్థిక సంవత్సరంనుంచి కొత్త  పథకాలను అమలు చేయనున్నట్టు ప్రకటించారు.

 

ముఖ‍్యంగా  ఏడాదిపాటు అటు డేటా, ఇటు వాయిస్‌ కాల్స్‌ను ఉచితంగా అందించిన తమ నెట్‌వర్క్‌ ఏప్రిల్‌ 1  ప్రారంభం నుంచి టారిఫ్‌లను వసూలు చేయనున్నట్లు కంపెనీ చైర్మన్‌ స్పష్టం చేశారు. తద్వారా ఉచిత సేవల పొడిగింపు అంచనాలకు తెరదించారు. ఈ సందర్భంగా ఏప్రిల్‌ 1 నుంచి వాణిజ్య ప్రాతిపదికన టారిఫ్‌ పథకాలు ప్రారంభించనున్నట్లు అంబానీ స్పష్టం చేశారు. ఇతర నెట్‌వర్క్‌లు ఆఫర్‌ చేస్తున్న ధరల్లోనే డేటా పథకాలు అందివ్వనున్నట్లు తెలిపారు. అయితే 20 శాతం డేటా అదనంగా అందించనున్నట్లు చెప్పారు.



2017 చివరికల్లా దేశమంతా జియో నెట్‌వర్క్‌ను కవర్‌ చేయడమే లక్ష్యంగా  ముందుకెళుతున్నట్టు  అంబానీ చెప్పారు. ముఖ్యంగా 99 శాతం దేశీ జనాభాను కవర్‌ చేయనున్నామన్నారు.  అలాగే గత నెలలో జియో సబ్‌స్క్రైబర్లు 100 కోట్ల జీబీని మించి వినియోగించుకున్నారన్నారు. హ్యాపీ న్యూ ఇయర్‌ ఆఫర్‌ ముగిసిన మార్చి 31  తరువాత కూడా  ప్రైమ్‌ మెంబర్‌ షిప్‌ రిజిస్టర్‌  ద్వారా  అన్ని నెట్‌వర్క్‌లకూ  ఫ్రీగా కాలింగ్‌  సదుపాయం ఉంటుందన్నారు. ఈ వాయిస్‌ కాల్స్‌కు రోమింగ్‌తో సహా ఎలాంటి చార్జీలు విధించమని అంబానీ ప్రకటించారు.   

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top