కటాఫ్‌ వస్తేనే ‘మెరిట్‌’లో చోటు

కటాఫ్‌ వస్తేనే ‘మెరిట్‌’లో చోటు


► గతేడాదికంటే కాస్త సులభంగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌

► కెమిస్ట్రీలో 3 ప్రశ్నల జవాబులపై కొంత సందిగ్ధం

► వచ్చే నెల 11న ఫలితాలు, 19 నుంచి ప్రవేశాలు షురూ



సాక్షి, హైదరాబాద్‌:
ఐఐటీల్లో ప్రవేశాల కోసం ఆదివారం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ప్రశ్నలు గతేడాది కంటే సులభంగా వచ్చాయి.  కెమిస్ట్రీలో 3 ప్రశ్నలకు, ఫిజిక్స్‌లో 3 ప్రశ్నలకు ఇచ్చిన జవాబుల విషయంలో కొంత సందిగ్ధం నెలకొన్నట్లు సబ్జెక్టు నిపుణులు వెల్లడించారు. ఈ పరీక్షలు రాసేందుకు దేశ వ్యాప్తంగా 1.7 లక్షల మంది, తెలుగు రాష్ట్రాల నుంచి 31,695 మంది దరఖాస్తు చేసుకోగా, ఎంతమంది హాజ రయ్యారన్న కచ్చితమైన వివరాలు తెలియరా లేదు. పరీక్షలకు హాజరైన విద్యార్థులు కనీస అర్హత మార్కులు సాధిస్తేనే మెరిట్, ర్యాంకుల జాబితాలో చోటు కల్పిస్తారు. ఓపెన్‌ కేటగిరీలో 35% మార్కులను విద్యార్థులు సాధించాలి. ఓబీసీ–నాన్‌ క్రీమీలేయర్‌ కేటగిరీలో 31.5 శాతం మార్కులను, ఎస్సీ కేటగిరీలో 17.5 శాతం, ఎస్టీ కేటగిరీలో 17.5 శాతం, ప్రతి కేటగిరీలో వికలాంగులు 17.5 శాతం మార్కులను సాధించాల్సి ఉంది.



ఈ పరీక్షకు సంబంధించి ఈనెల 31న ఉదయం 10 గంటల నుంచి వచ్చే నెల 3 వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో ఓఎంఆర్‌ జవాబు పత్రాలను ప్రదర్శిస్తారు. వాటిపై అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు స్వీకరి స్తారు. వచ్చే నెల 4న ఉదయం వెబ్‌సై ట్‌లో జవాబుల కీలను అందుబాటులో ఉంచుతారు. 6వ తేదీ వరకు వాటిపై విద్యార్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారు. 11వ తేదీన ఉదయం 10 గంటలకు ఫలితాలను ప్రకటి స్తారు. ఆర్కిటెక్చర్, బీప్లానింగ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఆర్కిటెక్చర్‌ ఆప్టి ట్యూట్‌ టెస్టు (ఏఏటీ) కోసం వచ్చే నెల 11, 12 తేదీల్లో ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పిస్తారు. 14వ తేదీన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఏఏటీ పరీక్ష ఉంటుంది. 18వ తేదీన వాటి ఫలితా లను విడుదల చేస్తారు. వచ్చే నెల 19న ఎన్‌ఐ టీ, ట్రిపుల్‌ఐటీ, ఐఐటీ ల్లో సంయుక్త ప్రవేశాల ప్రక్రియను ప్రారంభించి జూలై 18లోగా ఈ ప్రవేశాలను పూర్తి చేస్తారు.



ఇదీ నిపుణుల విశ్లేషణ..

పేపరు–1లో మొత్తంగా 183 మార్కులతో కూడిన 54 ప్రశ్నలు ఇచ్చినట్లు సబ్జెక్టు నిపుణు లు ఎంఎన్‌రావు, కేదారీశ్వర్, రామకృష్ణ తెలిపా రు. పేపరు–2లోనూ అలాగే ఇచ్చారని పేర్కొ న్నారు. పేపరు–1లో మ్యాథ్స్‌లో 18, ఫిజిక్స్‌ లో 18, కెమిస్ట్రీలో 18 ప్రశ్నలు ఇచ్చారని వివ రించారు. ప్రతి సబ్జెక్టులో ఆబ్జెక్టివ్‌ విధానంలో 7 ప్రశ్నలు ఇచ్చారని, మరో 5 సింగిల్‌ డిజిట్‌ ఇంటీజర్‌ ప్రశ్నలు ఇచ్చినట్లు వెల్లడించారు. మరో త్రీ కాలమ్స్‌ మ్యాట్రిక్స్‌ మ్యాచింగ్‌ ప్రశ్న లను గతంలో ఎన్నడూలేని విధంగా ఇచ్చినట్లు వివరించారు. కొన్ని కేటగిరీల ప్రశ్నలకు నెగిటివ్‌ మార్కులు లేవు. పార్షియల్‌ మార్కింగ్‌ విధానంలోనూ ప్రశ్నలు ఇచ్చారు.



పేపరు మొత్తంలో 21 ప్రశ్న లకు ఒకటికంటే ఎక్కువ సరైన సమాధానాలు ఉన్న ప్రశ్నలు ఇచ్చారు. 15 ప్రశ్నలు సింగిల్‌ డిజిట్‌ ఇంటీజర్‌ (0 నుంచి 9 లోపు ఉన్న అంకెలే సమాధానం గా ఉంటాయి.) జవాబులు కలిగిన ప్రశ్నలు ఇచ్చారు. 18 ప్రశ్నలు మ్యాట్రిక్స్‌కు సంబందించినవి ఇచ్చారు. ఇంటీజర్‌ టైపు ప్రశ్నల్లో నెగిటివ్‌ మార్కుల విధానం లేదు. ఇక పేపరు– 2లో ప్రతి సబ్జెక్టులో 7 సింగిల్‌ ఆన్సర్‌ ప్రశ్నలు ఇచ్చారు. మరో 7 మల్టీ ఆన్సర్‌ ప్రశ్నలు ఇచ్చారు. మరో 4 ప్రశ్నలు పాసేజ్‌కు సంబం ధించినవి వచ్చినట్లు వారు వెల్లడించారు. మొత్తంగా 54 ప్రశ్నలు 183 మార్కుల విధానాన్ని పాటించారు. ఇందులో కొన్నింటికి నెగిటివ్‌ మార్కుల విధానం ఉంది. పాసేజ్‌ విధానంలో నెగిటివ్‌ మార్కులు లేవు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top