ఖైదీ కోరాడని.. జైల్లో అమ్మాయిలతో డాన్సులు


హత్యానేరానికి శిక్ష అనుభవిస్తున్న ఖైదీ కోరాడని.. జైల్లో అమ్మాయిలతో డాన్సు ప్రోగ్రాం పెట్టించాడో జైలర్. ఈ ఘటన పంజాబ్లోని చండీగఢ్లో జరిగింది. హత్యానేరం మీద ఆ జైల్లో అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్న సర్వణ్ సింగ్ అడిగాడని... గురుదాస్పూర్ జిల్లాలోని ఫతేగఢ్ చురియాన్ గ్రామం నుంచి రూ. 16 వేలు వెచ్చించి మరీ సంప్రదాయ నాట్యబృందాన్ని రప్పించారు. 2013లో భాగుపూర్ ప్రాంతంలో యువజన కాంగ్రెస్ నేత సుఖ్రాజ్ సింగ్ హత్యకేసులో అతడు నిందితుడు. అతడితో పాటు మరో అకాలీదళ్ యువజన నేత కొట్టుకుని పొడుచుకోవడంతో ఈ ఘటన బయటకు వచ్చింది.



ఖైదీలకు ఆహ్లాదం కలిగించేందుకు ముందుగా ఎలాంటి అనుమతి లేకుండా డిప్యూటీ జైల్ సూపరింటెండెంట్ దేవీందర్ సింగ్ రణ్ధవా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసినట్లు అమృతసర్ జైలు సూపరింటెండెంట్ ఆర్కే శర్మ పంజాబ్ జైళ్లశాఖ ఏడీజీపీ మీనాకు సమర్పించిన నివేదికలో తెలిపారు. వాస్తవానికి పురుషుల జైల్లోకి మహిళలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదు. రిక్రియేషన్ కాంప్లెక్సులోకి గానీ, సెల్లోకి గానీ పంపకూడదు. దీన్ని ఉల్లంఘించి మరీ ఈ డాన్సు ప్రోగ్రాం ఏర్పాటుచేశారన్నమాట.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top