భ్రమలు తొలగిపోయాయ్..!

జగ్గారెడ్డిని పార్టీలోకి ఆహ్వానిస్తున్న భట్టి విక్రమార్క. చిత్రంలో జానారెడ్డి, ఉత్తమ్ - Sakshi

సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌పై ప్రజల్లో భ్రమలు తొలగిపోయాయని, అన్ని వర్గాల ప్రజలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై అసంతృప్తితో ఉన్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి(జగ్గారెడ్డి) సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.

గాంధీభవన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మెదక్ డీసీసీ అధ్యక్షురాలు సునీతా లకా్ష్మరెడ్డి అధ్యక్షత వహించగా ఏఐసీసీ కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌సీ కుంతియా, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, శాసనసభ, మండలిలో ప్రతిపక్ష నాయకులు జానారెడ్డి, షబ్బీర్ అలీ, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రులు జె.గీతారెడ్డి, డి.కె.అరుణ తదితర ముఖ్యనేతలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్నీ సీఎం కేసీఆర్ అమలు చేయలేదని విమర్శించారు. పూటకో కొత్తమాటతో కాలం వెళ్లదీస్తున్నారన్నారు. ఏఐసీసీ కార్యదర్శి కుంతియా మాట్లాడుతూ బీజేపీపై, ప్రధానమంత్రి మోదీపై ప్రజలకు విశ్వాసం పోయిందన్నారు.

‘సభ్యత్వం’పై సమీక్ష

రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీరుతెన్నులను ఏఐసీసీ కార్యదర్శి రామచంద్ర కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సోమవారం జిల్లాల వారీగా సమీక్షించారు. నియోజకవర్గాల్లో ఇప్పటిదాకా ఎంత సభ్యత్వం జరిగింది, బలహీనంగా ఉన్నచోట తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేయకుండా నేతలంతా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సూచించారు. త్వరలో ఉప ఎన్నికలు జరిగే వరంగల్ లోక్‌సభతోపాటు, వరంగల్ నగరపాలక, జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కుంతియా ఆదేశించారు. జిల్లాల వారీగా సభ్యత్వ కార్యక్రమానికి వస్తున్న స్పందనను డీసీసీ అధ్యక్షులను కుంతియా అడిగి తెలుసుకున్నారు.

రాహుల్ ప్రసంగాల సీడీ విడుదల

ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పార్లమెంటులో, రైతు సభలలో చేసిన ప్రసంగాలతో మండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ రూపొందించిన సీడీని గాంధీభవన్‌లో ఆవిష్కరించారు. ‘లీడర్స్‌టాక్’ పేరుతో రూపొందిం చిన ఈ సీడీని ఏఐసీసీ కార్యదర్శి ఆర్.సి.కుంతియా, టీపీసీసీ అధ్యక్ష, కార్యనిర్వాహక అధ్యక్షులు ఉత్తమ్, భట్టివిక్రమార్క, ప్రతిపక్షనేత కె.జానారెడ్డి తదితరులు ఆవిష్కరించారు. రాహుల్‌గాంధీ ప్రసంగించిన వీడియో క్లిప్పింగులతో ఈ సీడీని రూపొందించారు.

నోటి దురుసుతోనే ఓడిపోయా: జగ్గారెడ్డి

సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌పై ప్రజల్లో భ్రమలు తొలగిపోయాయని, అన్ని వర్గాల ప్రజలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై అసంతృప్తితో ఉన్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి(జగ్గారెడ్డి) సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.

గాంధీభవన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మెదక్ డీసీసీ అధ్యక్షురాలు సునీతా లకా్ష్మరెడ్డి అధ్యక్షత వహించగా ఏఐసీసీ కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌సీ కుంతియా, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, శాసనసభ, మండలిలో ప్రతిపక్ష నాయకులు జానారెడ్డి, షబ్బీర్ అలీ, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రులు జె.గీతారెడ్డి, డి.కె.అరుణ తదితర ముఖ్యనేతలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్నీ సీఎం కేసీఆర్ అమలు చేయలేదని విమర్శించారు. పూటకో కొత్తమాటతో కాలం వెళ్లదీస్తున్నారన్నారు. ఏఐసీసీ కార్యదర్శి కుంతియా మాట్లాడుతూ బీజేపీపై, ప్రధానమంత్రి మోదీపై ప్రజలకు విశ్వాసం పోయిందన్నారు.

‘సభ్యత్వం’పై సమీక్ష

రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీరుతెన్నులను ఏఐసీసీ కార్యదర్శి రామచంద్ర కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సోమవారం జిల్లాల వారీగా సమీక్షించారు. నియోజకవర్గాల్లో ఇప్పటిదాకా ఎంత సభ్యత్వం జరిగింది, బలహీనంగా ఉన్నచోట తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు.

సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేయకుండా నేతలంతా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సూచించారు. త్వరలో ఉప ఎన్నికలు జరిగే వరంగల్ లోక్‌సభతోపాటు, వరంగల్ నగరపాలక, జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కుంతియా ఆదేశించారు. జిల్లాల వారీగా సభ్యత్వ కార్యక్రమానికి వస్తున్న స్పందనను డీసీసీ అధ్యక్షులను కుంతియా అడిగి తెలుసుకున్నారు.

రాహుల్ ప్రసంగాల సీడీ విడుదల

ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పార్లమెంటులో, రైతు సభలలో చేసిన ప్రసంగాలతో మండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ రూపొందించిన సీడీని గాంధీభవన్‌లో ఆవిష్కరించారు. ‘లీడర్స్‌టాక్’ పేరుతో రూపొందిం చిన ఈ సీడీని ఏఐసీసీ కార్యదర్శి ఆర్.సి.కుంతియా, టీపీసీసీ అధ్యక్ష, కార్యనిర్వాహక అధ్యక్షులు ఉత్తమ్, భట్టివిక్రమార్క, ప్రతిపక్షనేత కె.జానారెడ్డి తదితరులు ఆవిష్కరించారు. రాహుల్‌గాంధీ ప్రసంగించిన వీడియో క్లిప్పింగులతో ఈ సీడీని రూపొందించారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Read also in:
Back to Top