ఆరే ఆరు సెకండ్లలో అంతా హ్యాక్!

ఆరే ఆరు సెకండ్లలో అంతా హ్యాక్!

హ్యాకింగ్.. హ్యాకింగ్... నెట్ లావాదేవీల్లో ఎక్కడ చూసినా ఇదే లొల్లి. ప్రపంచ ఆన్లైన్ వ్యవస్థను ఇది షేక్ చేసేస్తోంది. దేశాల ఆర్థిక వ్యవస్థలనే ఛిన్నాభిన్నం చేస్తోంది. ఇటీవలే దాదాపు 32 లక్షల బ్యాంక్ డెబిట్ కార్డులను హ్యాకర్లు తమ ఆధీనంలోకి తెచ్చుకుని దేశ బ్యాంకింగ్ వ్యవస్థకే సవాలు విసిరారు. అయితే ఇంత భీభత్సం సృష్టిస్తున్న హ్యాకర్లు.. మన ల్యాప్టాప్లను, ఇంటర్నెట్ కనెక్షన్తో కూడా వీసా క్రెడిట్, డెబిట్ కార్డులను వారి స్వాధీనంలోకి తెచ్చుకోవడానికి ఎంత సమయం వెచ్చిస్తున్నారో తెలిస్తే మాత్రం షాక్. కేవలం ఆరే ఆరు సెకండ్లలో యూజర్ల ల్యాప్టాప్లను, వీసా క్రెడిట్, డెబిట్ కార్డులను హ్యాక్ చేయగలరని ఓ రీసెర్చ్ సంస్థ వెల్లడించింది.

 

ఈ రీసెర్చ్ రిపోర్టును ఐఈఈఎఫ్ సెక్యురిటీ అండ్ ప్రైవసీ ఓ జర్నల్లో ప్రచురించింది.  పేమెంట్ కార్డు డేటా హ్యాకర్ల బారిన పడినట్టు ఏ నెట్వర్క్, ఏ బ్యాంకు వెంటనే గుర్తిచంలేదని ఈ జర్నల్ పేర్కొంది. గెస్సింగ్ అటాక్ ద్వారా కేవలం ఆరు సెకన్లలో యూజర్ల కార్డు నెంబర్, గడువు తుది తేదీ, సీవీవీ వివరాలను స్వాధీనం చేసుకుంటారని న్యూకాసిల్ యూనివర్సిటీకి చెందిన పీహెచ్డీ విద్యార్థులు చెప్పారు.  

 

ఆన్లైన్ కొనుగోళ్లకు వివిధ వెబ్సైట్లు వివిధ రూపాల్లో కార్డు డేటా నింపే ప్రక్రియను ఆఫర్ చేస్తాయని, దీంతో హ్యాకర్లు కార్డు వివరాలను తేలికగా హ్యాక్ చేయడానికి అవకాశముంటుందని ఆ యూనివర్సిటీకి చెందిన పీహెచ్డీ స్టూడెంట్ మహ్మద్ అలీ చెప్పారు. ప్రస్తుతం ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్ వివిధ వెబ్సైట్ల నుంచి వచ్చే మల్టిపుల్ ఇన్వాలిడ్ పేమెంట్ అభ్యర్థనలనూ గుర్తించలేదని తెలిపారు. ఈ మేరకు యూజర్లు అప్రమత్తంగా ఉండాలని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. 
Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top