ప్రభుత్వ ప్రకటనలు తీసుకుంటున్నారా? జాగ్రత్త!

ప్రభుత్వ ప్రకటనలు తీసుకుంటున్నారా? జాగ్రత్త!


 కోల్‌కతా: పశ్చిమ బెంగాల్  రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రకటనలు తీసుకునేటప్పుడు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ(ఐఎన్‌ఎస్) తన సభ్యులకు సూచించింది. ఐఎన్‌ఎస్ కార్యవర్గం కమిటీ సోమవారం ఇక్కడ సమావేశమైంది. తన సభ్య పత్రికలకు కొన్నింటికి ప్రభుత్వం చాలా ఏళ్లుగా ప్రకటనల బిల్లులు చెల్లించకపోవడంపై కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మీడియా పరిశ్రమ ఇప్పటికే కష్టాల్లో ఉన్న నేపథ్యంలో బిల్లుల డబ్బులు రాక ఈ పత్రికలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొంది.



ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెంటనే బకాయిలు చెల్లించాలని కార్యవర్గం కోరినట్లు ఐఎన్‌ఎస్ ప్రధాన కార్యదర్శి వి.శంకరన్ ఓ ప్రకటలో తెలిపారు. గత ప్రభుత్వ హయాం నాటి బకాయిలను చెల్లించొద్దని బెంగాల్ ప్రభుత్వం అనుకుంటోదన్న వార్తలపై కార్యవర్గం ఆందోళన వ్యక్తం చేసిందన్నారు.  ఈ వైఖరి రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధమని  కార్యవర్గం పేర్కొనట్లు తెలిపారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top