రికార్డు సృష్టించిన అతి పెద్ద కిడ్నీ

రికార్డు సృష్టించిన అతి పెద్ద కిడ్నీ


ప్రపంచంలోనే  అతి బరువైన, పెద్ద కిడ్నీని ఢిల్లీలోని శ్రీ గంగారాం ఆసుపత్రి వైద్యులు తొలగించారు. సాధారణంగా  కిడ్నీ బరువు సుమారు 130 గ్రాములుంటుందని, మామూలు బరువు కంటే దాదాపు 20 రెట్లు ఎక్కువ బరువున్న కిడ్నీని తొలగించడం వైద్య చరిత్రలోనే అరుదైన ఘటన అని ఢిల్లీ వైద్యులంటున్నారు. 2.75 కిలోల బరువున్న ఈ కిడ్నీని  తొలగించడానికి వైద్యులు చాలా కష్టపడాల్సి వచ్చింది. సుమారు 3 గంటల పాటు సాగిన శస్త్రచికిత్సను డాక్టర్ మను గుప్త  ఆధ్వర్యంలో నిర్వహించారు.




విపరీతమైన కడుపు నొప్పి, మూత్రంలో రక్తం,  విపరీతమైన జ్వరంతో బాధపడుతున్న ఓ వ్యక్తి ఢిల్లీ వైద్యులను సంప్రదించారు. ఆటోసోమల్ డామినెంట్ పోలిసిస్టిక్ కిడ్నీ (ఏడీపీకేడి)  అనే వ్యాధి  అతడికి సోకినట్టు వైద్యులు గుర్తించారు. రోగి పరిస్థితి విషమించడంతో ఆపరేషన్ చేసి కిడ్నీ తొలగించాలని వైద్యులు నిర్ణయించారు. ఈ రోగి శరీరం నుంచి 2.5 కేజీల బరువున్న  కిడ్నీని ఇంతకు ముందే తొలగించిన వైద్యులు   ఇపుడు  ఈ అతి పెద్ద రెండో కిడ్నీని కూడా తొలగించారు. ప్రస్తుతం డయాలసిస్ సాయంతో కోలుకుంటున్న ఆయన అవయవ మార్పిడి కోసం ఎదురు చూస్తున్నారని వైద్యులు తెలిపారు.


అయితే 2011లో 2.15 కిలోల బరువున్న కిడ్నీని తొలగించిన మహారాష్ట్ర వైద్యులు దాంతోనే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును సాధించారు. ఇప్పుడు దానికంటే బరువైన 2.75 కిలోల బరువున్నకిడ్నీని తొలగించి ఇప్పుడు ఢిల్లీ వైద్యులు ఆ రికార్డును అధిగమించారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top