'ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తు తరాలు ఎవరినీ క్షమించవు'
x
మీరు ఇక్కడ ఉన్నారు: హోం వార్తలుకథ

హెచ్‌–1బీ బిల్లు ఇబ్బందికరమే

Sakshi | Updated: February 13, 2017 23:44 (IST)
హెచ్‌–1బీ  బిల్లు ఇబ్బందికరమే

భారతీయ వృత్తినిపుణుల ఆందోళన
వాషింగ్టన్‌: అమెరికన్‌ కాంగ్రెస్‌లో ట్రంప్‌ నేతృత్వంలోని యంత్రాంగం ఇటీవల ప్రవేశపెట్టిన హెచ్‌1బీ బిల్లుపట్ల భారతీయ వృత్తినిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది తమపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందంటూ వారు వ్యధ చెందుతున్నారు. భారత సంతతికి చెందిన వందమందికిపైగా వృత్తినిపుణులు ఇటీవల ఈ విషయమై సిలికాన్‌ వ్యాలీలో సమావేశమయ్యారు. చట్టాలు రూపొందించేవారికి దీనిపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని వారు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.

‘వర్క్‌ వీసాల దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు సంస్కరణలు తెచ్చిఉన్నట్టయితే మేము సమర్థించేవాళ్లం. అయితే అనేక బిల్లులు కనీస వేతన పెంపునకు సంబంధించినవే. ఇక్కడి వర్సిటీల్లో ఇటీవల విద్యాభ్యాసం పూర్తిచేసిన వారితోపాటు వృత్తినిపుణులపైనా ఈ బిల్లులు తీవ్ర ప్రతికూల ప్రభావం చూపడం తథ్యం. ఇటీవలే ఉద్యోగాల్లో చేరినవారికి సైతం గరిష్ట వేతనం ఇచ్చే సంస్థలు దొరకవు. అందువల్ల ఏడాదికి లక్షా 30 వేల డాలర్ల ఉద్యోగం దొరకదు.’అని గ్లోబల్‌ ఇండియన్‌ టెక్నాలజీ ప్రొఫెషనల్స్‌ అసోసియేషన్‌ (జిట్‌ప్రొ) అధ్యక్షుడు ఖండేరావ్‌ ఖండ్‌ సోమవారం మీడియాతో పేర్కొన్నారు. 

వ్యాఖ్యలు

Advertisement

Advertisement

Advertisement

EPaper

తెలంగాణ థౌజండ్‌వాలా

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC