విపత్తులకు భారత్, చైనా విలవిల


న్యూయార్క్: వాతావరణ సంబంధిత విపత్తుల కారణంగా భారత్, చైనా దేశాలు అత్యధికంగా ప్రభావితమయ్యాయని ఐక్యరాజ్యసమితి నివేదిక ఒకటి మంగళవారం వెల్లడించింది. 1995-2015 మధ్య కాలంలో సంభవించిన విపత్తుల వల్ల ఈ రెండు దేశాల్లో 3 బిలియన్ల మందికి పైగా ప్రభావితం చెందారని తెలిపింది. త్వరలో ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో కీలక వాతావరణ సదస్సు జరగనున్న నేపథ్యంలో ప్రకృతి విపత్తులకు మానవ మూల్యం పేరిట యునెటైడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్(యూఎన్‌ఐఎస్‌డీఆర్) ఓ నివేదిక విడుదల చేసింది.  



 నివేదికలోని మరిన్ని వివరాలు

► 1995-2015 మధ్య కాలంలో సంభవించిన విపత్తుల కారణంగా చైనాలో 2,274 మిలియన్ల మంది విపత్తుల ప్రభావానికి గురవగా, భారత్‌లో సుమారు 805 మిలియన్ల మంది ప్రభావితమయ్యారు.

► గత రెండు దశాబ్దాల్లో భారత్‌లో 288 విపత్తులు సంభవించగా, అమెరికా(472), చైనా(441), ఫిలిప్పీన్స్(274), ఇండొనేసియా(163) చొప్పున సంభవించాయి.

► 6457 వరద ఘటనల వల్ల 90 శాతం అతి పెద్ద విపత్తులు సంభవించాయి.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top