ఆ సినిమా తర్వాత రజనీ బిగ్‌ అనౌన్స్‌మెంట్‌!

ఆ సినిమా తర్వాత రజనీ బిగ్‌ అనౌన్స్‌మెంట్‌! - Sakshi


చెన్నై: సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయాల్లోకి వస్తానంటూ ఊరిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన రాజకీయ ఆగమనం ఖాయమని, అందులో భాగంగానే రైతులతోపాటు అన్ని వర్గాల నేతలతో వరుసగా భేటీలు నిర్వహిస్తూ.. రంగం సిద్ధం చేసుకుంటున్నారని వినిపిస్తోంది. ఈ క్రమంలోనే తన రాజకీయ ప్రవేశంపై ఇన్నాళ్లు మౌనం వహించిన రజనీ ఇప్పుడు ఉత్కంఠ పెంచే రీతిలో ప్రకటనలు చేస్తున్నారు. రాజకీయాల్లోకి వస్తానంటూ పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నారు. తాజగా ఆయన రాజకీయ ప్రవేశంపై స్పందించారు. రోబో-2 సినిమా విడుదల తర్వాత తన రాజకీయ ప్రవేశంపై ‘పెద్ద ప్రకటన’ (బిగ్‌ అనౌన్స్‌మెంట్‌) చేయబోతున్నట్టు రజనీ ప్రకటించారు. సెప్టెంబర్‌, అక్టోబర్‌లో తాను మరోసారి అభిమానులతో సమావేశమవుతానని, తాను రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించిన వెంటనే అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తానని రజనీ విస్పష్టంగా తెలిపారు.



రజనీ రాజకీయ ఆగమనం ఖాయమని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. తన పుట్టినరోజు అయిన డిసెంబర్‌ 12న ఆయన కొత్త రాజకీయ పార్టీని ప్రకటించే అవకాశముందని అంటున్నారు. డిసెంబర్‌ నాటికి రోబో సినిమా విడుదల అవుతుంది. అత్యంత భారీ బడ్జెట్‌తో శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదల తర్వాత గ్రాండ్‌ రాజకీయ పార్టీని ప్రకటించాలని రజనీ భావిస్తున్నారని, అందుకే ఈ ప్రకటన చేశారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top