మరో బాంబు పేల్చిన ఐటీ అధికారులు

మరో బాంబు పేల్చిన  ఐటీ అధికారులు


న్యూఢిల్లీ:  పెద్దనోట్ల రద్దు, బ్యాంకుల్లో  పాత నోట్ల డిపాజిట్ల  గడువు ముగిసిన అనంతరం ఆదాయ పన్ను అధికారులు మరో బాంబు  పేల్చారు.  రూ .15 లక్షల కోట్లపాతనోట్లు బ్యాంకులకు చేరాయన్న అంచనాలతో  ఆదాయ పన్ను శాఖ బ్యాంకు నగదు డిపాజిట్ పోకడల విశ్లేషణ ప్రారంభించింది.  ఈ క్రమంలో నవంబరు 8 కి ముందు బ్యాంకుల్లో జమ అయిన నగదుపై కూడా ఆరా తీస్తోంది.  ముఖ్యంగా  ఏప్రిల్ 2016 నుంచి నవబంరు 9 వరకు ఆయా బ్యాంకుల్లో  నమోదైన  డిపాజిట్ల  వివరాలను కూడా పరిశీలిస్తోంది. 

 

డీమానిటేజేషన్ కి ముందు నెలల్లో బ్యాంకింగ్ లావాదేవీలను పరిశీలిస్తున్న ఐటీ శాఖ కోఆపరేటివ్  బ్యాంకులు సహా  అన్ని బ్యాంకులు, పోస్ట్ ఆఫీసుల నగదు డిపాజిట్ల  నివేదికను సమర్పించాల్సిందిగా కోరింది. పాన్ కార్డు వివరాలు గానీ, ఫాం60 గాని సమర్పించని ఖాతాదారుల డిపాజిట్ల వివరాలు అందించాలని కోరింది. సంబంధింత వివరాలను ఫిబ్రవరి 2017 లో సమర్పించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.



కాగా రూ.500, 1000 నోట్ల రద్దుతో  కేంద్ర ప్రభుత్వం  భారీ సంచలనానికి తెర లేపింది.  నల్లధనాన్ని అరికట్టేందుకు, నకిలీ కరెన్సీని  నిరోధించేందుకంటూ చేపట్టిన ఈ డీమానిటైజేషన్  ప్రక్రియలో అనేక మార్పులు చేపట్టింది.  నగదు కష్టాలకు అనేక ఉపశమన చర్యల్ని పక్రటించింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ రిజర్వ్ బ్యాంక్ ఇండియా ఆదాయ పన్ను అధికారులకు  కీలక ఆదేశాలను జారీ చేసింది.  ముఖ్యంగా నవంబరు 9 తరువాత  నవంబర్ 10-డిసెంబర్ 30, 2016 మధ్య బ్యాంకులు, పోస్ట్ ఆఫీసుల పొదుపుఖాతాలరూ.2.5 లక్షలకుపైన డిపాజిట్లను, కరెంట్ ఖాతాల్లో రూ.12.50 లక్షల డిపాజిట్ల వివరాలను  కోరింది. అలాగే  ఒకే రోజులో రూ .50వేలకు మించిన నగదు  డిపాజిట్ల వివరాలను అందించాలని  కోరిన సంగతి తెలిసిందే.


 
Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top