పార్టీలో ఆ హీరో డ్రెస్‌ చూసి బిత్తరపోయారు!




బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ది కాస్తా విభిన్నమైన శైలి. ఒకింత విచిత్రంగా, కాస్తా వికృతంగా దుస్తులు వేసుకొని.. జనాల్లోకి రావడం ఆయనకు అలవాటు. తాజాగా కూడా చాలా విచిత్రమైన డ్రెస్‌తో షాహిద్‌ కపూర్‌ ప్రీ బర్త్‌డే పార్టీలో దర్శనమిచ్చి అందరికీ షాక్‌ ఇచ్చాడు‌. అతని డ్రెస్‌ను చూసి పార్టీకి వచ్చిన జనాలు ఒకింత విస్తుపోయారు. కుర్తాపైజామానే కాస్తంత సరికొత్తగా రణ్‌వీర్‌ వేసుకొచ్చాడు. అతని డ్రెస్‌ స్టైల్‌ చూసి కొందరు ఎలియన్‌లా ఉందని కామెంట్ చేస్తే.. మరికొందరు కండోమ్‌ను తలపిస్తున్నదంటూ ట్విట్టర్‌లో జోకులు పేల్చారు.



ట్రెండీ ఫ్యాషన్‌లో రణ్‌వీర్‌ది కాస్తా వికృతమైన పోకడ అయితే, అతని ప్రియురాలు దీపికా పదుకొణేది అదరగొట్టే స్టైల్‌. ఎప్పటిలాగే ఈ పార్టీకి దీపిక చూపరుల మతిపొగోట్టే హై ఫ్యాషన్‌ డ్రెస్‌లో వచ్చింది. బ్లాక్‌ టాప్‌, గోల్డ్‌ కలర్‌ ప్యాంటుతో ఆమె పార్టీలో ధగధగలాడిపోయినా.. అందరి దృష్టి తిప్పుకుంది మాత్రం రణ్‌వీర్ వికృత ఫ్యాషనే.

(ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top