డిసెంబర్లో పెట్రోల్ ధర ఎంతో తెలుసా?
అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు బాగా తగ్గుతున్నాయి. దేశంలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు ఎంతకూ దిగిరావడం లేదు. ప్రస్తుతం అంతర్జాతీయంగా బ్యారెల్ ముడిచమురు ధర 46.90 డాలర్లుగా ఉంది. ఇటీవల బ్యారెల్ ముడిచమురు ధర 1.2శాతం తగ్గింది కూడా. దేశంలో మాత్రం రూ. 60కి తగ్గకపోగా, అప్పుడప్పుడు సర్దుబాట్ల పేరుతో పెట్రోల్ వాత వినియోగదారులపై పడుతూనే ఉంది.
ఈ నేపథ్యంలో ముడిచమురు ధర అంచనా విషయంలో మీరు నిపుణులు అయితే.. డిసెంబర్ నెలలో ముడిచమురు ధర ఎంత ఉంటుందో గేస్ చేయగలరా? అంటూ బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ట్విట్టర్లో అడిగారు. అంతేకాకుండా తాను ఈ ప్రశ్న ఎందుకు అడిగానో రేపు చెప్తానంటూ ట్విస్టు ఇచ్చారు. ఇంతకు రేపు సుబ్రహ్మణ్యస్వామి ఏం ట్విస్టు ఇస్తారు? అంతర్జాతీయంగా ముడిచమురు ధర పెరుగుతుందా? తగ్గుతుందా? అన్నది నెటిజన్లు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఊహించడానికి ఏముంది డిసెంబర్ అంటే 2016 ముగిసేనాటికి ముడిచమురు ధర గరిష్టంగా 48.52 డాలర్లు, కనిష్టంగా 55.07 డాలర్లు ఉండే అవకాశముందని ఓ నెటిజన్ అభిప్రాయపడగా, అంతర్జాతీయ పరిణామాలను బట్టిచూస్తే.. డిసెంబర్ నాటికి ముడిచమురు ధరలు భారీగా పెరిగి బ్యారెల్కు 80 నుంచి 95 డాలర్లకు చేరే అవకాశముందని, దీంతో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరింతగా మండిపోవచ్చునని మరో నెటిజన్ అంచనా వేశారు.
PTs: Any or some of you specialise in crude oil price forecasting? If so guess what will be the price in this December
— Subramanian Swamy (@Swamy39) 29 August 2016