బంగారంపై పన్ను రేట్లు పెరుగుతాయా?

బంగారంపై పన్ను రేట్లు పెరుగుతాయా?

న్యూఢిల్లీ : బంగారంపై పన్ను రేట్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏకీకృత పన్ను పాలనకు రూపొందించిన ఫైనల్ డ్రాఫ్ట్ కు ఆమోదం తెలుపడానికి ఉదయ్పూర్ లో భేటీ కాబోతున్న జీఎస్టీ కౌన్సిల్, నేడు బంగారంపై పన్ను రేట్లు ఎలా ఉండాలన్నది నిర్ణయిస్తుందని తెలుస్తోంది. వస్తువులపై నాలుగు శ్లాబులుగా పన్ను రేట్లు నిర్ధారించిన జీఎస్టీ కౌన్సిల్, ఇంకా బంగారంపై పన్ను రేటు  ఎలా ఉండాలో నిర్ధారించలేదు. పన్ను నియంత్రణపై కేంద్ర, రాష్ట్రాల మధ్య ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో ఏప్రిల్ 1 నుంచి అమలుచేయాల్సిన జీఎస్టీని ప్రస్తుతం ప్రభుత్వం 2017 జూలై 1 నుంచి ప్రభుత్వం అమలు చేసేందుకు సిద్ధమైంది.

 

ప్రస్తుతం అన్ని సమస్యలు ఓ కొలిక్కి వచ్చాయి. ఒక్క బంగారంపై ఎంత పన్ను విధించాలనే అంశమే పెండింగ్లో ఉంది. జీఎస్టీ కింద విలువైన మెటల్స్కు 4 శాతం పన్ను విధించాలని కేంద్ర, రాష్ట్రాలు నిర్ణయిస్తున్నట్టు సమాచారం. ఇది ప్రస్తుతమున్న రేటు కంటే ఎక్కువ. ఎక్కువ పన్ను విధించడం అక్రమాలకు దారితీస్తుందని మరోవైపు నుంచి బంగార వర్తకులు వాదిస్తున్నారు. 

 

అయితే చీఫ్ ఎకనామిక్ అడ్వయిజర్ అరవింద్ సుబ్రహ్మణ్యం ప్రతిపాదించిన రిపోర్టు ప్రకారం బంగారంపై 4 శాతం పన్ను విధింపుకే తాము మద్దతిస్తామని కేరళ ఆర్థికమంత్రి చెప్పారు. ప్రస్తుతం వ్యాట్ కింద బంగారంపై 1 శాతం, ఎక్స్చేంజ్ డ్యూటీ కింద నాన్-సిల్వర్ జువెల్లరీపై 1 శాతం విధిస్తున్నారు. సుబ్రహ్మణ్యం ప్రతిపాదించిన బంగారంపై 2 నుంచి 6 శాతం పన్నుకే చాలా రాష్ట్రాలు మొగ్గుచూపుతున్నాయి. దీంతో నేడు జరిగే భేటీ బంగారంపై పన్ను రేట్లు ఎలా ఉంటాయన్న దానిపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. 

 
Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top