నమస్తే.. ఛాన్సలర్ మోర్కెల్!

ఢిల్లీ విమానాశ్రయంలో జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ కు స్వాగతం పలుకుతున్న కేంద్ర మంత్రి జయంత్ సిన్హా


న్యూఢిల్లీ: సహచర క్యాబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు సహా బడా వ్యాపారవేత్తలతో కూడిన భారీ బృందంతో జర్మన్ ఛాన్సలర్ ఏంజిలా మోర్కెల్ భారత్ కు విచ్చేశారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం రాత్రి ఢిల్లీకి చేరుకున్న మోర్కెల్ బృందానికి కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా ఘనస్వాగతం పలికారు. 'నమస్తే.. ఛాన్సలర్ మోర్కెల్! మీకు, మీ బృందానికి హృదయపూర్వక ఆహ్వానం. మీ పర్యటనతో భారత్- జర్మనీల మైత్రి మరింత ఫలప్రదం అవుతుందని ఆశిస్తున్నా' అంటూ ఏంజెలా రాకను స్వాగతిస్తూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.



రేపు (సోమవారం) ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మోర్కెల్ భేటీ కానున్నారు. ఆరు మాసాల వ్యవధిలో రెండోసారి జరగనున్న ద్వైపాక్షిక చర్చల్లో పలు వాణిజ్య, రక్షణ ఒప్పందాలతోపాటు భారత్- యూరోపియన్ యూనియన్ వ్యాపార ఒప్పందాలపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. పర్యటనలో భాగంగా ఏంజిలా మోర్కెల్ బెంగళూరునూ సందర్శిస్తారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top