ఆ శకలాలు ఏఎన్‌-32 విమానంవేనా!

ఆ శకలాలు ఏఎన్‌-32 విమానంవేనా! - Sakshi


న్యూఢిల్లీ: గత శుక్రవారం గల్లంతైన ఏఎన్‌-32 విమానం ఆచూకీకి సంబంధించి కీలక పురోగతి లభించినట్టు భావిస్తున్నారు. తాజాగా బంగాళాఖాతం సముద్రంలో కొన్ని శకలాలు తేలుతూ కనిపించాయని, ఇవి ఏఎన్-32 విమానానివేనా అన్నది ఇంకా ధ్రువీకరించలేదని కేంద్ర రక్షణమంత్రి మనోహర్ పారికర్ తెలిపారు. ఆ శకలాలు గల్లంతైన విమానానివేనా అన్నది ధ్రువీకరించమని నేవీకి సూచించినట్టు చెప్పారు. భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్‌) చెందిన ఈ విమానం గాలింపు చర్యల విషయంలో ఏమాత్రం రాజీపడబోమని ఆయన స్పష్టం చేశారు.



ఏఎన్‌-32 విమానం గల్లంతై ఆరురోజులు కావొస్తున్నది. ఈ విమానం జాడ కోసం ముమ్మరంగా భద్రతా దళాలు గాలిస్తున్న సంగతి తెలిసిందే. అయినా, 29మంది భద్రతా సిబ్బంది ప్రయాణిస్తున్న ఆ విమానికి ఏమైందన్న జాడ ఇప్పటికీ తెలియలేదు. నానాటికీ విమానంలో ప్రయాణిస్తున్న వారు సురక్షితంగా బతికి బయటపడే ఆశలు అడుగంటిపోతున్నాయి.



విమానం ఆచూకీ కోసం ఇప్పటివరకు నిర్వహించిన ఆపరేషన్‌లో అన్ని ప్రతికూల సంకేతాలు అందాయని భద్రతా వర్గాలు చెబుతున్నాయి. 13 నావాలు, 2 కోస్ట్‌గార్డ్‌ షిప్పులు అండమాన్ నికోబార్ దీవుల సమీపంలోని సముద్రంలో ప్రస్తుతం విస్తృతంగా గాలింపులు నిర్వహిస్తున్నాయి.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top