ఎస్‌ఎంకేకు కొత్త జట్టు

ఎస్‌ఎంకేకు కొత్త జట్టు - Sakshi


సాక్షి, చెన్నై: అఖిల భారత సమత్తువ మక్కల్ కట్చికి(ఎస్‌ఎంకే) కొత్త జట్టు ఎంపికైంది. ఆ పార్టీ అధ్యక్షుడిగా సినీ నటుడు శరత్‌కుమార్ మళ్లీ ఎంపికయ్యారు. ఆయన సతీమణి, నటి రాధిక శరత్‌కుమార్ ఆ పార్టీ మహిళా విభాగం ప్రధానకార్యదర్శిగా నియమితులయ్యారు. ఆదివారం తిరునల్వేలి వేదికగా జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో రానున్న ఎన్నికల్లో పొత్తు ఎవరితో అన్న అంశంపై చర్చించారు. సమత్తువ మక్కల్ కట్చిలో గత నెల ప్రకంపన బయ లు దేరిన విషయం తెలిసిందే.



ఆ పార్టీ ప్రధాన కార్యదర్శితో పాటుగా పలువురు బీజేపీలో చేరడం, తదుపరి ఆ పార్టీ ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎర్నావూర్ నారాయణన్ తిరుగు బావుటా ఎగురవేయడంతో వివాదం రచ్చకెక్కింది. ఎస్‌ఎంకేను కైవసం చేసుకోవడం లక్ష్యంగా ఎర్నావూర్ నారాయణన్ తీవ్ర ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆదివారం తిరునల్వేలి వేదికగా ఆ పార్టీ సర్వ సభ్య సమావేశానికి శరత్‌కుమార్ పిలుపు నిచ్చారు. ఈ పిలుపునకు అమిత స్పందన వచ్చిందని చెప్పవచ్చు.



రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాల అధ్యక్షులు, కార్యవర్గ కమిటీ, రాష్ట్ర నాయకులు తరలి రావడంతో ఎస్‌ఎంకే ను కైవసం చేసుకోవడం ఎవరి తరం కాదన్న ధీమా శరత్‌కుమార్‌లో నెలకొన్నట్టు అయింది. ఈ సమావేశం నిమిత్తం తూత్తుకుడి నుంచి తిరునల్వేలి కేటీసీ నగర్‌కు చేరుకున్న శరత్‌కుమార్‌కు పార్టీ వర్గాలు బ్రహ్మరథం పట్టారు.

 

మళ్లీ అధ్యక్షుడిగా: పార్టీలో నెలకొన్న ప్రకంపనను చల్లార్చే దిశగా ఈ సమావేశ ఆరంభంలో కొత్త జట్టు ఎంపిక మీద శరత్‌కుమార్ దృష్టి పెట్టారు. పార్టీ నుంచి ముఖ్య పదవుల్లో ఉన్న వాళ్లు బయటకు వెళ్లడంతో, వారి స్థానాల్ని భర్తీ చేస్తూ, కొత్త జట్టును ప్రకటించారు. సర్వ సభ్య సమావేశం ఆమోదంతో పార్టీ అధ్యక్షుడిగా శరత్‌కుమార్ మళ్లీ ఎంపిక అయ్యారు. పార్టీ ప్ర ధాన కార్యదర్శిగా జయ ప్రకాష్, కోశాధికారిగా సుందరేషన్, ఉపాధ్యక్షుడిగా కాళిదా స్, సహాయ ప్రధాన కార్యదర్శులుగా ష ణ్ముగ సుందరం, పన్నీరు సెల్వం, ప్రిసీడి యం చైర్మన్‌గా సెల్వరాజ్, రాజకీయ సల హాదారుడిగా లారెన్స్‌ను ఎంపిక చేస్తూ శరత్‌కుమార్ ప్రకటించారు.



ఇక పార్టీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా రాధికను ఎంపిక చేశారు. అలాగే, ఇతర పదువులకు ఎంపికైన వారి వివరాల్ని ప్రకటించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు ఎ వరితో అన్న అంశంపై పార్టీ వర్గాల అభిప్రాయాల్సి శరత్‌కుమార్ సేకరించారు.

 

డీఎంకే వైపు చూపా: అభిప్రాయ సేకరణ అనంతరం శరత్‌కుమార్ ప్రసంగిస్తూ, పార్టీ తొమ్మిదో  ఏట అడుగు పెట్టిందని గుర్తు చేస్తూ, ఈ కాలంలో ఎంతో ప్రగతిని సాధించామన్నారు. రాష్ట్రంలో పొత్తులు కుదరడం లేదని గుర్తు చేస్తూ, అస్సలు ఎన్నికల ముందు పొత్తులు అవసరమా అని ప్రశ్నించారు.ఎ న్నికల అనంతరం పొత్తులు కుదిరి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుందని వ్యాఖ్యానించారు.



రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ వారి వారి బలం ఏమిటో చాటుకోవాలంటే ఒంటరి సమరానికి సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు. రాష్ట్రంలో ఎవరంటే, వాళ్లు తానే సీఎం ...తానే సీఎం అని చెప్పుకుంటున్నారని,అలాంటప్పుడు తాను కూడా ఓ కూటమి ఏర్పాటు చేసుకుని సీఎంగా ప్రకటించుకుంటానంటూ చమత్కరించారు.  సీఎం కుర్చి కోసం పరుగు పందెం ఇక్కడ సాగుతున్నట్టుందని వ్యాఖ్యానిస్తూ, పార్టీ వర్గాల అభిప్రాయాల మేరకే తన నిర్ణయం  ఉంటుందన్నారు.



ఈసందర్భంగా తన ప్రసంగంలో ఆయన చేసిన వ్యాఖ్య డిఎంకే వైపుగా ఎస్‌ఎంకే చూస్తున్నదా..? అన్న ప్రశ్నను లేవ దీసినట్టు అయింది. ఇన్నాళ్లు నీడలో ఉన్నానని, సూర్య రశ్మి కోసం బయటకు వస్తున్నట్టుగా వ్యాఖ్యానించడంతో, డిఎంకే చిహ్నం ఉదయించే సూర్యుడిని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేశారన్న భావనలో అక్కడున్న ప్రతి ఒక్కరిలోనూ బయలు దేరింది.



ఇదే విషయంగా ఆయన్ను మీడియా కదిలించగా, అలాంటిది ఏమి లేదు అని, ఓ అంశాన్ని వివరించే క్రమంలో ఆ పదాన్ని వాడడం జరిగిందే గానీ, పొత్తుపై ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదన్నారు. అవసరం అయితే, ఒంటరిగా ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు సైతం పరిశీలన జరుపుతున్నట్టు సమాధానం ఇచ్చారు. పార్టీ వర్గాలు కీలక నిర్ణయాలు తీసుకునే అధికారం తనకు అప్పగించారని, త్వరలో మంచి ప్రకటన ఉంటుందన్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top