న్యాయ పోరాటం చేసి ప్రాణాలు కోల్పోయాడు!


ఖాట్మండు: కన్న కొడుకు హత్యకు గురి కావడం ఆ తల్లిదండ్రులను కలచివేసింది. 17 ఏళ్ల తమ కుమారుడిని మావోయిస్టులు హత్య చేయడంపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపించాలని కోరారు. వారికి న్యాయం దక్కలేదు. దీంతో నందప్రసాద్ అధికారి(56) ఆయన భార్య గంగామాయ(54) గతేడాది అక్టోబర్ 25న ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు. అయినా వారి అభ్యర్థనను ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. సుదీర్ఘకాలం ఆహారం లేకపోవడంతో నందప్రసాద్ సోమవారం ఖాట్మండులోని ఓ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. దీక్షలోనూ భర్తతో కలసి సాగిన గంగామాయ పరిస్థితి సీరియస్‌గా ఉంది.


 


2004లో ఈ దంపతుల కుమారుడు కష్ణప్రసాద్‌ను గోర్ఖాలోని ఫుజెల్ ప్రాంతంలో ఇంటి నుంచి మావోయిస్టు రెబల్స్ అపహరించి తీసుకెళ్లగా... తర్వాత రత్నానగర్ ప్రాంతంలో అతడు శవమై తేలాడు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top