మిస్‌ యూనివర్స్‌.. ఎవిటా

మిస్‌ యూనివర్స్‌.. ఎవిటా


కౌలాలంపూర్‌: అందాలపోటీల్లో తాజా సంచలనం.. 20 ఏళ్ల ఎవిటా డెల్ముండో. ఈమె గురించి రాయని పత్రిక ప్రపంచంలో దాదాపు లేదంటే అతిశయోక్తికాదు. మలేసియాకు చెందిన ఎవిటా.. ఓ కెఫేలో పార్ట్‌టైమ్‌ జాబ్‌ చేస్తూ ఫ్యాషన్‌ రంగంపై దృష్టిపెట్టింది. మిస్‌యూనివర్స్‌ మలేసియా- 2018 పోటీల్లో పాల్గొనేందుకు ఉవ్విళ్లూరుతోంది. ఆ పోటీల్లో పాల్గొనే కంటెస్టెంట్ల కోసం ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో సత్తాచాటింది. మరికొద్ది రోజుల్లో ఫలితాలు రానున్నాయి. కంటెస్టెంట్‌గా సెలెక్ట్‌ అయితే.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న మిస్‌ యూనివర్స్‌ మలేసియా ప్రధాన పోటీల్లో ఎవిటాను చూడొచ్చు. సెలెక్ట్‌ కాకపోయినా పర్లేదు. ఎందుకంటే.. ఇప్పటికే ఆమె మిస్‌ యూనివర్స్ కిరీటాన్ని సొంతం చేసుకుంది. అందంతో కాదు ఆత్మవిశ్వాసంతో!



ఎవిటాకు పుట్టుకతోనే ముఖం, మెడ, ఇతర శరీర భాగాలపై పుట్టుమచ్చలున్నాయి. వయసు పెరుగుతున్న కొద్దీ మచ్చల కూడా పెద్దవయ్యాయి. క్లాస్‌మేట్స్‌, టీచర్ల ఛీత్కారాలనడుమ స్కూల్‌డేస్‌ భారంగా గడిచాయి. ఆమెతో ఆడుకోవడానికి ఎవరూ ఇష్టపడేవారుకారు. టీనేజ్‌లో ఉండగా వేరే స్కూల్‌కి మారడం, అక్కడ తనను అవమానించని కొత్త స్నేహితులు దొరకడంతో ఎవిటాలో కాన్ఫిడెన్స్‌ పెరిగింది. ఆ ఆత్మవిశ్వాసమే ఆమెను మిస్‌యూనిర్స్‌ పోటీలవైపునకు నడిపించింది.



ఆపరేషన్‌ వద్దు.. ఇలానే ఉంటా!

శరీరంపై ఇబ్బందికరంగా ఉన్న పుట్టుమచ్చల్ని సర్జరీ ద్వారా తొలగించుకోవచ్చని కొందరు ఎవిటాకు సూచించారు. డాక్టర్లు మాత్రం.. సర్జరీవల్ల భవిష్యత్తులో చర్మవ్యాధులు రావచ్చని అభిప్రాయపడ్డారు. చివరికి ఎవిటా.. ఆపరేషన్‌ చేయించుకోకూడదని ఫిక్సైంది. ‘పుట్టుకతో వచ్చిన మచ్చలివి. దీన్ని నేనెప్పుడూ వైకల్యంగా భావించలేదు. ఆ అవసరం కూడా లేదు. ఐ లవ్‌ మై స్కిన్‌ అండ్‌ ఐ లవ్‌ మై సెల్ప్‌’ అంటుంది ఎరిటా.









Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top