నగ్నంగా ఫోటో తీసుకుని...

నగ్నంగా ఫోటో తీసుకుని... - Sakshi


లండన్: జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి చందంతా తయారైంది సెల్ఫీ పిచ్చి. స్మార్ట్ ఫోన్ తో వివిధ భంగిమల్లో స్వీయ చిత్రాలు తీసుకోవడం, వాటిని అందరికీ చూపించడం ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్. ఇంగ్లండ్ లో ఓ గడుగ్గాయి నగ్నంగా సెల్ఫీ తీసుకుని దాన్ని తనతో పాటు చదివే విద్యార్థినికి పంపించాడు.



ఉత్తర ఇంగ్లండ్ లో నివసిస్తున్న 14 ఏళ్ల బాలుడు ఈ పనిచేశాడు. అయితే అతడిపై పోలీసులు కేసు నమోదు చేయలేదు. పోలీసు డేటా బేస్ లో అతడి పేరు నిక్షిప్తం చేశారు. ఈ సమాచారాన్ని 10 ఏళ్ల పాటు ఉంచుతారని బాలుడి తల్లి తెలిపారు. భవిష్యత్ లో అతడు ఉద్యోగం చేయబోయే కంపెనీకి ఈ సమాచారం అందిస్తారని చెప్పారు. చిన్నతనంలో చేసిన తప్పుకు అతడి జీవితంతో ఆడుకోవడం దారుణమన్నారు.



తన బెడ్ రూములో సెల్ఫీ తీసుకుని తన పాఠశాల వినియోగించే స్నాప్ చాట్ ద్వారా దాన్ని విద్యార్థినికి పంపినట్టు బీబీసీ రేడియోతో ఆ బాలుడు చెప్పాడు. అయితే ఈ యాప్ లో మెసేజ్ 10 సెకన్లలో డిలీట్ అవుతుంది. ఈలోపు సదరు బాలిక నగ్న సెల్ఫీని తన సొంత ఫోన్ లో సేవ్ చేసి, ఇతర విద్యార్థులకు పంపడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top