ఈ-కామర్స్లో 120లక్షల ఉద్యోగాలు!

ఈ-కామర్స్లో 120లక్షల ఉద్యోగాలు!


న్యూఢిల్లీ : రాబోయే రోజుల్లో భారత్లో ఈ-కామర్స్ రంగానికి ఆదరణ గణనీయంగా పెరుగుతుందట. వచ్చే 10ఏళ్లలో ఈ సెక్టార్, దాదాపు 120 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు అందిస్తుందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇప్పటికే లక్షలాది మంది ఈ సెక్టార్ లో ఉద్యోగాలు అందుకుంటున్నారని, సర్వీసు సెక్టార్ రంగంలో ఈ-కామర్స్ ఓ కొత్త మార్గంగా రూపుదిద్దుకోబోతుందని హెచ్ఎస్బీసీ రిపోర్టు వెల్లడించింది. యువ జనాభా పెరగడం, స్మార్ట్ఫోన్లకు డిమాండ్ వేగవంతంగా పెరగడం, డిజిటల్ పేమెంట్ల విప్లవం ఇవన్నీ ఈ-కామర్స్ రంగం గణనీయమైన వృద్ధికి దోహదం చేస్తాయని పేర్కొంది.



అయితే, ఇంటర్నెట్ వ్యాప్తికి, ఆన్ లైన్ కొనుగోలుకు చైనా కంటే భారత్ ఏడేళ్లు వెనుకబడి ఉందని రిపోర్టు తెలిపింది. ప్రస్తుతం భారత్ సృష్టిస్తున్న ఉద్యోగాలతో పోలిస్తే ఈ-కామర్స్ రంగంలో ఉద్యోగాలు ఎక్కువ ప్రొడక్టివ్గా ఉంటాయని రిపోర్టు అధ్యయనం కనుగొంది. ఆన్లైన్ కొనుగోలు పెరుగుతున్నా కొద్ది ఈ-కామర్స్ దిగ్గజాలు లాజిస్టిక్స్& డెలివరీ, కస్టమర్ కేర్, ఐటీ అండ్ మేనేజ్ మెంట్లలో 20 మిలియన్ ఉద్యోగాలను సృష్టిస్తాయని హెచ్ఎస్బీసీ వెల్లడించింది.



వచ్చే దశాబ్దంలో భారత్ లో క్రియేట్ అయ్యే 24 మిలియన్ ఉద్యోగాల్లో, సగం ఈ-కామర్స్ రంగమే భర్తీ చేస్తుందని ఈ రిపోర్టు తెలిపింది. చైనాలో గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న డిజిటల్ షాపుల మాదిరిగా.. భారత్లోనూ 5 మిలియన్ గ్రామీణ వర్తకులతో ఈ రెవల్యూషన్ ప్రారంభంకాబోతుందని వెల్లడించింది. దీంతో వచ్చే పదేళ్లలో మరిన్ని జీవనోపాధి అవకాశాలు గ్రామాల్లో అందుబాటులోకి వస్తాయని హెచ్ఎస్బీసీ రిపోర్టు పేర్కొంది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top