పిల్లాడిని కాపాడి ప్రాణాలు కోల్పోయింది
శాన్ బెనెడెటోడెల్: స్ఫూర్తిదాయక సాహసం చేసి తనువు చాలిందో శునకం. నీళ్లలో మునిగిపోతున్న ఐదేళ్ల బాలుడి ప్రాణాలు కాపాడి తాను మాత్రం తనువు చాలించింది. ఇటలీలోని ఆడ్రియాటిక్ తీర ప్రాంతంలో జరిగిన ఈ ఘటన అందరినీ కదిలిచింది.
మార్షి ప్రాంతంలో శాన్ బెనెడెటోడెల్ ట్రొరంటో వద్ద సముద్రంలో తన కళ్లెదుటే మునిగిపోతున్న ఐదేళ్ల బాలుడిని చూసిన బారెల్లొ అనే మేస్టిజొ కుక్క వెంటనే ముందుకు ఉరికింది. నీళ్లలోకి దూకి తన శాయశక్తులా ప్రయత్నించి బాలుడిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది. అయితే ఈ క్రమంలో బారెల్లొ నీటిలో మునిగి చనిపోయింది.
సంబంధిత వార్తలు