బాహుబలి-2 లోపం ఏమిటో తెలుసా?

బాహుబలి-2 లోపం ఏమిటో తెలుసా? - Sakshi


ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన  ‘బాహుబలి-2’ అంచనాలకనుగుణంగానే బ్లాక్‌ బస్టర్‌గా నిలవనుంది.  ఈ క్రమంలో సూపర్‌ డూపర్‌ హిట్‌ టాక్‌ తో శరవేగంగా దూసుకుపోతోంది.  ఇప్పటిదాకా అనేక అంచనాలు, ఊహల మధ్య  మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మిలిగిన  కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనేదానికి సమాధానం మొత్తానికి రివీల్‌ అయిపోయింది.  టాలీవుడ్‌ దర్శక దిగ్గజం  రాజమౌలి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులోని  ‘బాహుబలి-2’ పై  ఎనలిస్టులు రివ్యూలు కూడా  చాలా పాజిటివ్‌గా ఉన్నాయి. అద్భుతం, అమోఘం అంటూ విమర్శకులు ఈసినిమాను ఆకాశానికెత్తేస్తున్నారు. అదే సందర్భంలో   లోపాలను కూడా  ప్రస్తావించడం విశేషం.



ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, అనుష్క, సత్యరాజ్‌ల  అమోఘ నటన, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో వచ్చిన ‘బాహుబలి ది కంక్లూజన్’   విమర్శకుల  ప్రశంసలు సైతం  అందుకున్నప్పటికీ  చిన్న విమర్శను కూడా మూటగట్టుకుంది. ఈ మేరకు  చిత్రంలోని  లోపాన్ని ఎత్తి  చూపుతున్నారు. ముఖ్యంగా  ఫస్ట్‌ హాఫ్‌  బ్రహ్మాండంగా ఉండగా సెకండ్ హాఫ్ మాత్రం  సుదీర్ఘంగా సాగతీతగా అనిపించిందని పేర్కొంటున్నారు.  అంతేకాదు తన మానస పుత్రిక బాహుబలి రెండవ భాగం సక్సెస్‌కోసం  జక్కన్న ఎంత టెన్షన్‌ పడ్డాడో ప్రతి ప్రేమ్‌లో కొట్టొచ్చినట్టు కనిపించిందని వ్యాఖ్యానిస్తున్నారు. పాటలు కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయని అభిప్రాయపడ్డారు అయితే రాజమౌళి స్పెషల్‌ టేకింగ్‌, కమల్ కణ్నన్ విజువల్ ఎఫెక్ట్స్, కీరవాణి నేపథ్య సంగీతంతో ప్రేక్షకులు పెద్దగా  బోర్‌ ఫీల్‌ అవరని చెబుతున్నారు.



స్టోరీ, స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీకి ఫస్ట్‌ మార్కులు పడ్డాయి. అటు నటులు ఎవరి పాత్రల్లో వారు ఇమిడిపోయి తమ రోల్స్‌కి పూర్తి న్యాయం చేకూర్చారని రివ్యూలు తేల్చాయి. ఇక అమరేంద్ర బాహుబలిగా ప్రభాస్ నటనకు, రాజసానికి, అనుష్క  పాత్రను ఎలివేట్‌ చేసిన తీరుకు ఫిదా అయిపోతున్నారు. అయితే   సొంతబిడ్డలా సాకిన బాహుబలిని శివగామి ఎందుకు హత్య చేయించింది అనేదిమాత్రం సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.  మొత్తానికి ఎవరూ ఊహించని ట్విస్టులతో రాజమౌళి  మరో మెట్టు  అధిగమించాడు. తెలుగు సినిమా ఖ్యాతిని  బాహుబలి-2 ప్రపంచ స్థాయికి తీసుకెళుతుందన్న మాటలను నిలబెట్టుకున్నాడనే చెప్పాలి.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top